మూడు చేపల కథ

           మూడు చేపల కథ



ఒక చెరువులో మూడు చేపలున్నాయి. ఓ సంవత్సరం కరువు వచ్చే సూచనలు కనిపించాయి. వానలు లేక చెరువు ఎండిపోయే ప్రమాదమే వస్తే చెరువుల్లో బతికే చేపలకూ, యితర జంతువులకూ ఎప్పుడూ జీవన్మరణ సమస్యే. ఏం చేయాలి?

మొదటి చేపకు జాగ్రత్త ఎక్కువ. దానిపేరే 'అనాగత విధాత'. అది మిగిలిన రెండు చేపలతో "ఈ ఏడు ఈ చెరువు ఎండిపోవటం ఖాయం. ఇక్కడికి దగ్గర్లో మరో పెద్ద చెరువుంది. ఈ చెరువునించీ ఆ చెరువుకు ఈదుకు వెళ్ళేందుకు సన్నకాలవ కూడా ఉంది. మనం ఇప్పుడే జాగ్రత్తపడి అక్కడికి వెళ్ళిపోదాం!” అంది.

రెండో చేపకు కొంచెం బద్ధకం. దానిపేరు ప్రత్యుత్పన్న మతి. “దీనికిప్పుడే యింత కంగారెందుకు? ఇంకా కొన్నాళ్ళు చూద్దాం. అవసరమయితే అప్పుడాలోచించవచ్చు. ఇప్పటినించే బుర్ర చెడగొట్టుకోవడ మెందుకు?” అంది.

మూడో చేప పేరు యద్భవిష్యం. “ఎలా జరగవలసింది అలా జరుగుతుంది, మనం ఆపగలమా? దేవుడే చూసుకుంటాడు!" అని దాని భరోసా.

వీళ్ళతో పెట్టుకోకుండా, మొదటి చేప తన దోవన తను పెద్ద చెరువుకు వెళ్ళిపోయింది.

నీళ్ళు కొన్నాళ్ళ తరువాత ప్రమాదం రానే వచ్చింది. చెరువులో బాగా తగ్గిపోయాయి. పెద్దచెరువుకు వెళ్ళే కాలవ మార్గం ఎండిపోయింది. జాలరులు వచ్చి వలలూ, బుట్టలూ తెచ్చి చెరువులో ఉన్న చేపలన్నింటినీ పట్టేశారు. వలలో పడ్డ యద్భవిష్యం ప్రమాదం తెలుసుకోకుండా, ఏ ఉపాయం | లేకుండా వలలోనించీ మళ్ళీ నీళ్ళలోకి దూకాలనే ప్రయత్నం చేస్తుండగా జాలరులు దాన్ని కర్రతో కొట్టి చంపేశారు.

రెండోచేప ప్రమాదం వచ్చిందని తెలుసుకొని, చచ్చినదానిలా పడి ఉంది. దాన్ని పట్టుకొన్న జాలరి దాన్ని ఒడ్డుకు విసిరాడు. మిగిలిన చేపలన్నింటినీ కూడా పట్టుకొన్న తర్వాత వాడు గట్టుకుచేరి దాన్ని తీసుకొనే లోపల ఎలాగోలా రెండోచేప చచ్చీ చెడి గట్టు మీదనుంచీ నీళ్ళలోకి దొర్లి, ప్రాణం దక్కించుకొంది.

“అందుచేత దైవం, దైవం అని నిర్లిప్తంగా కూర్చొంటే చెడిపోతాం. మన జాగ్రత్తలో మనం ఉండాలి" అన్నది.

 ఆడతీతువు తన భర్తతో. “నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మనకే ప్రమాదమూ జరగదు, చూస్తూ వుండు" అన్నది మగతీతువు.

కొన్నాళ్ళకి ఆడతీతువు గుడ్లు పెట్టింది. ఆమె భయపడ్డట్టే, ఒక పర్వదినం నాడు సముద్రం పొంగి, దాని అలల తాకిడికి చెట్టుకొమ్మల్లో ఉన్న తీతువుపిట్టల గూడు పడిపోయి, అందులో గుడ్లన్నీ కొట్టుకుపోయాయి.

ఆడతీతువుకు, సహజంగానే, పట్టరానంత దుఃఖం వచ్చింది. “చూశావా, నేను చెప్తున్నా నువ్వు పట్టించుకోలేదు. యిప్పుడేం చేయాలో చెప్పు” అంటూ వలవలా ఏడ్చింది. భర్త దాన్ని ఊరడించాడు.

ఆ ప్రాంతంలో ఉన్న యితర పక్షులన్నిటినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేశాడు. 'సోదరులారా, చూశారా ఈ సముద్రం నిష్కారణంగా నాకు ఎంత ఘోరమయిన అన్యాయం చేసిందో? ఈ సముద్రాన్నంతా ఒక్క గుక్కలో పీల్చి పారెయ్యగల గరుత్మంతుడు  మనకు అండగా ఉన్నాడని, సముద్రం మర్చిపోయింది. ఈ సముద్రుడి పొగరు అణచాలంటే మనమందరం కలిసి పనిచేయాలి. లేకపోతే ఈరోజు నాకొచ్చిన కష్టం రేపు మీలో ఎవరికయినా రావచ్చు. అందువల్ల మనందరం కలిసి గరుత్మంతుణ్ణి ప్రార్థిద్దాం. ఆయనే నా కష్టాన్ని తొలగిస్తాడు" అని ఆ పక్షులన్నింటినీ ఒప్పించాడు.

పక్షులన్నీ కలిసి చేసిన తపస్సుకు సంతోషించి గరుత్మంతుడు ప్రత్యక్షమై "మీకేం కావాలో చెప్పండి!" అని అడిగాడు. పక్షులు సముద్రం చేసిన ఘోరాన్ని గరుత్మంతుడికి చెప్పాయి. గరుత్మంతుడు కోపంతో ఊగిపోయాడు. గరుత్మంతుడి బలమంటే సముద్రానికీ భయమే. గరుత్మంతుడు ఆజ్ఞ యివ్వగానే సముద్రుడు తీతువు పిట్టల గుడ్లు తిరిగి తెచ్చి అప్పజెప్పాడు. “ఈసారికి క్షమిస్తున్నాను. మళ్ళీ ఈ పిట్టలకేదయినా యిబ్బంది కలిగించావో, నీ భరతం పడతాను, జాగ్రత్త!” అని సముద్రాన్ని హెచ్చరించి గరుత్మంతుడు మాయమయ్యాడు.


No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...