తీతువుపిట్ట - సముద్రము

      తీతువుపిట్ట - సముద్రము

ఒక సముద్రం ఒడ్డున ఒక చెట్టు ఉంది. దానిమీద తీతువుపిట్టల జంట ఒకటి కాపురం ఉండేది. కొంతకాలానికి అడ తీతువు గర్భం ధరించింది. మగతీతువు "నీకేం కావాలో చెప్పు. నా శక్తంతా ఉపయోగించి నీకది తెచ్చి యిస్తాను". అంది. ఆడతీతువు, "నాకేమీ అక్కర్లేదు కానీ, పర్వదినాల్లో ఈ సముద్రం పొంగి అలలు మన చెట్టు కొమ్మలను తాకి తడిపేస్తున్నాయ్. రేప్పొద్దున నేను పెట్టబోయే గుడ్లు ఆ అలలతాకిడికి కొట్టుకు పోతాయేమోనని నాకు భయంగా ఉంది. అందువల్ల వీలయినంత త్వరగా మనం మరో చోటికి వెళ్ళటం మంచిది" అంది.

మగతీతువుకు ఆమె భయం చూసి నవ్వు వచ్చింది. "పిచ్చిదానా, పక్షులన్నిటికీ గరుత్మంతుడు రక్ష. ఆయనంటే నముద్రానికీ భయమే. కంగారుపడుతున్నావు” అన్నాడు. ఇది తెలియక నువ్వు

ఆడతీతువుకు ఈ ధోరణి నచ్చలేదు. "ఏదో ఆపద రాబోతుందంటే, తెలివయినవాడు, ఎంత బలవంతుడయినా దాన్నించీ తప్పించుకొనేందుకు ప్రయత్నం చేసుకోవాలి గానీ, నేనేదో బలవంతుణ్ణనుకొని గర్వంతో విర్రవీగి కూర్చొంటే వాడికే నష్టం. మనలాంటి బలహీనుల సంగతి చెప్పనే అక్కర్లేదు కదా? మంచిమాటలు వినని మూర్ఖుడు హంస-తాబేలు కథలో తాబేలు లాగా నాశనం పొందుతాడు" అంటూ ఆ కథ చెప్పింది.

భువనసారం అని పేరు గల ఒకానొక చెరువుండేది. అది చాలా అందమయిన పెద్దచెరువు. అందులో వికట, సంకటాలని రెండు హంసలూ, కంబుగ్రీవమనే ఓ తాబేలూ చాలా స్నేహంగా తిరుగుతూ ఉండేవి. ఒక సంవత్సరం వానలు పడక చెరువు బొత్తిగా ఎండిపోసాగింది. హంసలు రెండూ ఆ చెరువు విడిచి మరో పెద్ద చెరువుకు పోక తప్పదని నిశ్చయించుకొని, ఒకరోజు ఆ మాటే తాబేలుకు చెప్పాయి. అన్నాళ్ళ స్నేహం తరువాత తాబేలుని విడిచివెళ్ళాలంటే వాటికి ఎంతో దుఃఖం కలిగింది. తాబేలుకూ అంతే.

"మనం యిన్నాళ్ళూ సొంత అన్నదమ్ముల లాగ బతికాం. ఇప్పుడు మిమ్మల్నిలా విడిచిపెట్టాలంటే నా కెంతో బాధగా ఉంది. పోనీ మీతో వద్దామంటే, మీలా చకచకా ఎగిరి వెళ్ళేందుకు నాకు రెక్కలు లేవు. వేగంగా నడవను కూడా లేను. ఏదో ఒక ఉపాయం ఆలోచించి నన్ను కూడా మీతో తీసుకెళ్ళ గూడదూ?" అంది తాబేలు.

"అలాగే ఉంది కానీ ఏం చేస్తాం? నిన్ను వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్ళటానికి వీలుపడదు, చాలా దూరం వెళ్ళాలి కదా? పోనీ ముక్కున కరుచుకొని వెళ్తామంటే అదీ సాధ్యం కాదు. ఏదో సాహసం చేయబోయామంటే, తోవలో నువ్వు జారిపడిపోతే మొదటికే మోసం. ఎలాగోలా గుండెరాయి చేసుకుని బతికేయటం తప్పా మార్గం కనబడదు. నీకిక్కడ వచ్చిన ప్రమాదం లేదు. ఇక్కడే ఉండిపో, అదృష్టం బాగుంటే మళ్ళీ కలుద్దాం" అన్నాయి హంసలు.

కానీ కంబుగ్రీవం మొండిఘటం. ఎంత చెప్పినా ఊరుకోదు. ఎలాగోలా, ఎంత ప్రమాదకరమయినా సరే, నన్ను మీతో తీసుకెళ్ళండి అని పట్టుబట్టింది.

"నువ్వు మరీ అలా పట్టుబడితే, ఒక ఉపాయం ఉంది. కానీ అది చాలా ప్రమాదంతో కూడింది. ఒక కర్ర సంపాదించి దాన్ని చెరో చివరా మేమిద్దరం ముక్కుతో కరచిపట్టుకొంటాం. నువ్వు నీ నోటితో ఆ కర్రనే మధ్యలో గట్టిగా కరిచిపట్టుకో. కర్రతో సహా ఎగిరిపోదాం. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నోరు తెరచినా, పట్టు వదిలిపోయి దబ్బున కిందపడిపోతే ప్రాణాలు దక్కవు!” అన్నాయి హంసలు.

అదే ఉపాయం ప్రకారం హంసలు తాబేలుతో సహా
ఆకాశంలోకి ఎగిరి ప్రయాణం ప్రారంభించాయి. కానీ అవి
ఒక నగరం మీదిగా ఎగురుతుండగా, ఆ నగరంలో జనమంతా
ఈ వింత చూసి “ఏమిటిది, ఏమిటిది! హంసలు రెండు ఒక
కర్రను పట్టుకొని ఎగరడమేమిటి, ఆ కర్రని కరుచుకొని తాబేలు ఎగరడమేమిటి?" అని గుంపులుగా గుమిగూడి నగరవీధుల్లో ఆశ్చర్యంలో గోలగోలగా పరుగెట్టసాగారు.

ఆ కలకలం విన్న తాబేలు తన జాగ్రత్త మరిచిపోయి "ఏమిటీ కలకలం ?” అని అడగబోయి నోరు తెరిచింది. ఏమవుతుంది? దభీమని ఆకాశంలో అంతెత్తునించీ కిందపడిపోయింది. కొన ఊపిరితో మిగిలిన దాన్ని, నగరజనులు బతకనిస్తారా? మాంసం తీసుకెళ్ళిపోయారు!

“ఇంతకీ ఈ కథ ఎందుకు చెప్పానంటే అపాయం రాబోతున్నప్పుడు, ఏదో చేసేద్దాంలే, దేవుడున్నాడు గదా, గరుత్మంతుడున్నాడు కదా అంటూ సరయిన ఉపాయం లేకుండా కూర్చొంటే, కష్టం గట్టెక్కలేము. ఇది మనం తెలుసుకోవాలి” అంది ఆడతీతువు.

ఇదే నీతి చెప్పేందుకు ఆడతీతువు మరో కథ కూడా
చెప్పింది.


No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...