వడ్రంగి - సింహం

             వడ్రంగి - సింహం

ఓ ఊళ్ళో ఓ వడ్రంగి ఉండేవాడు. వాడు రోజూ అడవికి వెళ్ళి తన పనికి ఉపయోగించే చెట్లు నరికి, ఆ  మొద్దులతో రకరకాల సామాన్లు తయారుచేసి అమ్ముకొని పొట్టు పోసుకొనేవాడు.

ఒకరోజు అతను అడవిలో తిరుగుతుండగా ఒక సింహం  ఎదురొచ్చింది. భయంతో వణుకుతూ నిల్చుండిపోయాడు. సింహానికి అతని భయం చూసి జాలివేసింది. "భయపడబోకు. నేను ఏనుగు కుంభస్థలాల మీదికి ఎగిరి వాటిని చంపుతాను. కానీ, నీలాంటి బలహీనుల్ని చంపటంలో నాకు మజా లేదు. నీ దోవన నువ్వు వెళ్ళిపో" అంది.

ఆ వడ్రంగి 'బతుకుజీవుడా' అనుకొని ఆ సింహానికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్ళిపోయాడు. ఆ కృతజ్ఞతతో వడ్రంగి అడవికి వచ్చేప్పుడల్లా ఆ సింహం కోసం ఆహారం తెచ్చి యిస్తూండేవాడు.

ఇలా జరుగుతుండగా, ఒకరోజు ఆ సింహానికి సేవకులయిన కాకీ-నక్కా సింహంతో ముచ్చట్లాడుతూ “రాజా! ఈ మధ్య మీరు ఎక్కువగా వేటకు వెళుతున్నట్టు లేదు కారణమేమిటి?" అని అడిగాయి.

“అదో కథ. నాకో భక్తుడున్నాడు. వాడు నాకు ఆహారం తెచ్చిపెడుతూ ఉంటాడు" అంది సింహం.

“అంత మంచి భక్తుడెవరో ఓసారి మాకు చూపించగూడదా?” అన్నాయి కాకీ - నక్కా,

"అదెంత భాగ్యం. రండి, వెళదాం. కొంచెంసేపట్లో అతను రానే వస్తాడు. మీరే చూద్దురు గానీ” అంది సింహం.

రోజులాగే వడ్రంగి వచ్చాడు. సింహం కోసం ఆహారం కూడా తెచ్చాడు. కానీ సింహాన్ని, దాని పక్కనే ఉన్న కాకి నక్కలనూ చూడగానే కంగారుగా దగ్గర్లో ఉన్న చెట్టేక్కేశాడు. సింహానికి ఆశ్చర్యం వేసింది.

"ఇదేమిటి? క్రూరజంతువుని, నన్ను చూసి భయపడని

వాడివి, ఈరోజూ ఈ కాకీ - నక్కలను చూసి అంత

భయపడతావేం?" అంది సింహం.

“నీవల్ల నాకు ఏ హానీ జరగదని నాకు తెలుసు. కానీ నీ అనుచరులు కాకీ - నక్కా నీ పక్కనుంటే నీకేదో దుర్భోధ చేయకమానరు. రాజు మంచివాడయినా, అతని దగ్గిర ఉండే సహచరులు అతణ్ణి దుష్టుడిగా మార్చి పారేస్తారు. అదీ నా భయం!” అన్నాడు వడ్రంగి.

కాబట్టి, నేననేదేంటంటే, పింగళకుడికి సహజంగా నామీద ఎంత మంచి అభిప్రాయం ఉన్నా అతని సహచరులు ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి అతని మనసు విరిచేశారు. నామీద కోపం కలిగేట్టు చేశారు. ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? ఊరికే మరణించేకంటే, అతనితో యుద్ధం చేసే మరణిస్తాను స్వర్గం దక్కుతుంది” అన్నాడు సంజీవకుడు.

“నువ్వు చెప్పే బీరాలూ, వేదాంతం బాగానే ఉన్నాయి. కానీ, ఉపాయం ఉపయోగించి అపాయం లోంచి బయటపడే అవకాశం వెతుక్కోకుండా బలవంతుడయిన శత్రువుతో యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకోడం ఏం ధర్మం? యుద్ధం చేయదలచుకొంటే తన బలం, శత్రువు బలం సరిగా బేరీజు వేసుకొని, గెలవటం ఖాయమంటేనే యుద్ధానికి దిగాలి. లేకపోతే తీతువుపిట్టా-సముద్రం కథలాగా అవుతుంది” అని దమనకుడు ఆ కథ చెప్పాడు.

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...