నందిగుప్తుడు

                 నందిగుప్తుడు

నాపతి అనే పట్టణంలో నందిగుప్తుడూ, సుదర్శన గుడూ అని ఇద్దరు వర్తకులుండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి వాళ్ళిద్దరూ ఇతరదేశాల్లో కూడా వ్యాపారం చేసి చాలా... డబ్బు సంపాదించుకొని తిరిగి సొంత ఊరు చేరారు.

ఊరు చేరుతుండగానే నందిగుప్తుడు "సుదర్శనా, మనం 1 దేశాల్లో వ్యాపారం చేసి యింత సంపాదించుకొచ్చామని ఎవరికీ తెలియనియ్యడం మంచిదికాదు. తెలిస్తే అందరి కళ్ళూ 2 మన డబ్బు మీదే ఉంటాయి. అందుచేత మన డబ్బంతా ఇంకెబిందెలలో దాని రహస్యంగా ఊరి బయటే మర్రిచెట్టుకింద పాతివేసి ఉంచుదాం. కావలసినపుడు వచ్చి, కావలసినంత తీసుకువెళ్ళాం రహస్యంగా. ఏమంటావ్?" అన్నాడు.

మదర్శనుడు కూడా దానికి ఒప్పుకోవటంతో మిత్రులిద్దరూ డబ్బు దాచేసి, ఊరికి తిరిగి వచ్చారు.

నందిగుప్తుడికి దురాశ ఎక్కువ. ఓరోజు వాడు వెళ్ళి, సుదర్శనుడికి తెలియకుండా డబ్బు దాచిన బిందెలను తవ్వి తీసుకొని మరోచోట రహస్యంగా దాచుకొన్నాడు.

ఆ తరువాత కొన్నాళ్ళకు వాడు సుదర్శనుడి దగ్గరకు వెళ్ళి "సుదర్శనా మన దగ్గర ఎక్కువ డబ్బు లేదని అందర్నీ నమ్మించాము. పైగా దేశపరిస్థితులు సురక్షితంగానే ఉన్నాయి. దొంగల భయం కూడా తగ్గిపోయింది. కనుక యింక మనం మన డబ్బు తెచ్చేసుకొందాం" అన్నాడు.

మిత్రులిద్దరూ మర్రిచెట్టు కింద తవ్వి చూస్తే, సొమ్ము లేదు!

నందిగుప్తుడు గుండెలు బాదుకొంటూ "ఎంతపని చేశావు సుదర్శనా! సొమ్మంతా నాకు తెలీకుండా దొంగతనం చేశావా? మనిద్దరికీ తప్ప ఈ సొమ్ము సంగతి మూడోవాడికి తెలియదు. డబ్బంతా కాజేసి, ఏమీ తెలియనట్లు నటిస్తే వేసూరుకొంటానా? పద, రాజుగారి దివాణానికి, వాళ్ళు నాలుగు తగిలిస్తే గానీ నీకు బుద్ధి రాదు!" అంటూ, సుదర్శనుణ్ణి రాజుగారి దగ్గరికి లాక్కెళ్ళాడు.

"రాజా! వీడు నా మిత్రుడు, నా సొమ్ము దొంగి "లించాడు" అని ఫిర్యాదు చేశాడు.

"రాజా! మేం మిత్రులమన్నమాట నిజమే. మర్రిచెట్టు క్రింద యిద్దరం కలిసి రహస్యంగా డబ్బు దాచుకొన్నమాటా నిజమే. ఈరోజు దాచుకొన్న డబ్బు తెచ్చుకొనేందుకు వెళ్ళి చూస్తే అక్కడ డబ్బు లేదు. ఇంతవరకే నాకు తెలుసు. నేను ఏ పాపమూ ఎరగను" అన్నాడు సుదర్శనుడు చేతులు జోడించి.

రాజు తన ధర్మాధికారుల్ని పిలిచి ఈ తగవు తీర్చ
మన్నాడు.

వాళ్ళు విషయం విని, "సుదర్శనుడు డబ్బు దొంగిలించాడనేందుకు సాక్షులున్నారా?" అని అడిగారు నందిగుప్తున్ని.

"అయ్యా, సాక్షులు చూస్తుండగా దొంగ దొంగతనం చేస్తాడా? పైగా మేం డబ్బు దాచింది. ఎక్కడో ఊరు బయట మర్రిచెట్టు కింద. అక్కడ సాక్షులెవరుంటారు, ఎలా ఉంటారు, నన్ను ఎక్కడినించీ తీసుకు రమ్మంటారు?" అంటూ నందిగుప్తుడు. గుండెలు బాదుకున్నాడు..

కాసేపయిన తరువాత, ఒక ఎత్తు వేశాడు. దీనంగా చూస్తూ ధర్మాధికారితో యిలా అన్నాడు: "సాక్షి లేకపోవటమేమిటి? ఉంది. ఈ దొంగతనానికి ఆ మర్రిచెట్టు సాక్షి, నాలాంటి మంచివాడికి ఆ చెట్టే సాక్ష్యం చెబుతుంది. నేను సత్యం చెబుతుంటే, నాకు దుష్టబుద్ధి లేకపోతే, ఆ మర్రిచెట్టే నా పక్షాన సాక్ష్యం పలుకుతుంది. ఇదే నా శపథం. మీరు వచ్చి ఆ మర్రిచెట్టునే అడగండి!"

ఈ శపథం విని దివాణంలో అందరూ ఆశ్చర్యపోయారు. "ఈ కలికాలంలో చెట్ల చేత మాట్లాడించగల మహానుభావులూ, సత్యవంతులూ ఉంటారా?" అని కొందరు ముక్కున వేలేసుకున్నారు. "ఇవన్నీ కల్లబొల్లి మాటలూ, తనే సొమ్ము దొంగిలించి ఈ వేషాలన్నీ వేస్తున్నాడు!" అనుకొన్నారు. మరికొందరు.

ధర్మాధికారులు మాత్రం "ఈరోజు చాలా పొద్దు పోయింది. రేపు మనం మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి అడిగి చూద్దాం!" అని వెళ్ళిపోయారు.

ఆరోజు రాత్రి యింటికి వెళ్ళి, తలుపులన్నీ భద్రంగా బిడాయించి, నందిగుప్తుడు తన తండ్రితో ఈ విషయం అతి రహస్యంగా చర్చించాడు. "నాన్నా! ధనమూలమిదం జగత్ అన్నారు కదా! ధనం లేనివాడికి లోకంలో విలువలేదు. కనుక ఎలాంటి దుర్మార్గమయినా చేసి డబ్బు సంపాదించవచ్చని నా అభిప్రాయం. అంతగా అయితే తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుతోనే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అందుకని మర్రిచెట్టు కింద సొమ్యు నేనే దొంగిలించి, ఆ దొంగతనం సుదర్శనుడి నెత్తిన వేశాను. జనాన్ని నమ్మించడానికి ఈ మర్రిచెట్టు సాక్ష్యం ఎత్తువేశాను. పొద్దున్నే చీకటితో నువ్వు వెళ్ళి ఆ మర్రిచెట్టు తొర్రలో ఎవరికీ కనబడకుండా కూర్చో. ధర్మాధికారుల ప్రశ్నలకి జవాబు చెప్పి మర్రిచెట్టు సాక్ష్యం చెప్పిందని నమ్మించు. అప్పుడు నేనొక ధర్మరాజునని ధర్మాధికారులతో పాటు ఊళ్ళో అంతా నమ్మేస్తారు. సొమ్ము మనదవుతుంది. సుదర్శనుడు జైలులో పడతాడు!" అన్నాడు.

"కుమారా, నాకీ పని మంచిదని అనిపించటం లేదు. నువ్వు యిది ఉపాయమనుకొంటున్నావు గానీ దీనిలో అపాయం గ్రహించటం లేదు" అన్నాడు నందిగుప్తుడి తండ్రి.

"నాన్నా, మనకొచ్చిన ఆలోచన ప్రకారం పోవాలి గానీ, ఉపాయంలో అపాయముందని, అపాయానికి ఉపాయమనీ ఊరికే చర్చిస్తూ కూర్చొంటే పనులు జరగవు. ఈ చర్చకి క అంతుండదు. నేను చెప్పినట్లు చెయ్యి. అంతా బాగానే జరుగుతుంది" అని నందిగుప్తుడు తండ్రిని ఒప్పించాడు.

ఆర్ధరాత్రి దాటగానే వాడు తండ్రిని తీసుకెళ్ళి చెట్టుతొర్రలో కూర్చోబెట్టి వచ్చాడు. తెల్లవారగానే ధర్మాధికారులు దగ్గరకు వెళ్ళాడు. మర్రిచెట్టు సాక్ష్యం వింత చూసేందుకు ఊళ్ళో జనమంతా కూడా వాళ్ళతో పాటు ఊరి బయట మర్రిచెట్టు దగ్గర గుమిగూడారు.

ధర్మాధికారి మర్రి చెట్టును ఉద్దేశించి ప్రశ్నవేశాడు  "ఈ మిత్రుల యిక్కడ పాతిపెట్టిన ధనం ఏమయింది? ఎవరు దొంగిలించారు? నీకు తెలిస్తే నిజం చెప్పు" అని.

మర్రిచెట్టు మధ్యలోనించీ జవాబు వచ్చింది: "ఆ
ధనమంతా ఒకరోజు అర్ధరాత్రి సుదర్శనుడు ఒక్కడే వచ్చి
తీసికెళ్ళిపోయాడు" అని! వింటున్న జనమంతా నిశ్చేష్బులయిపోయారు. సుదర్శనుడికి మాత్రం యిది మోసమని తెలిసిపోయింది. "ధర్మాధికారులారా! ఇదేదో మోసం. దీన్ని నమ్మకండి. చెట్టేమిటీ, సాక్ష్యం చెప్పడమేమిటి? నాకు అనుమతిస్తే ఈ బండారం యిప్పుడే బయటపెడతాను" అన్నాడు. అందరూ చూస్తుండగా అతను చెట్టెక్కి ప్రతి కొమ్మా, తొర్రా గాలించాడు. ఒక తొర్రలో నించీ నందిగుప్తుడి ముసలి తండ్రి బయటికొచ్చాడు. అంతసేపు ఆ చెట్టు తొర్రలో కూర్చొని, కూర్చొని అతని సగం ప్రాణం పోయి వుంది. అందరి ముందు తన మోసం బయటపడగానే ఆ పరాభవం భరించలేక అక్కడే పడిపోయి ప్రాణాలు విడిచాడు. ధర్మాధికారులు సుదర్శనుడికి పాతిపెట్టిన ధనమంతా యిప్పించి, నందిగుప్తుడికి కొరతవేశారు.

అని కథ పూర్తి చేసి కరటకుడు యింకా యిలా అన్నాడు : “నాది కూడా తప్పే. నువ్వు ఈ దుర్మార్గపు మిత్రభేదం గురించి మొదట చెప్పినప్పుడే నేను నిన్ను వారించి ఉండా ల్సింది. పాపం, సంజీవకుడు మనకేం అపకారం చేశాడు? ఎందుకతనికిలా అన్యాయం చేశావు? పాపిష్ఠివాణ్ణి నేనూ అందుకు సహాయం చేసి పాపం కట్టుకొన్నాను. ఇతరులను మోసం చేసిన పాపం ఊరికే పోదు. అది మనకే తిరిగి తగులుతుంది" అంటూ ఇంద్రపాలితుడి కథ చెప్పసాగాడు.





No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...