మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...
పులి 🐯 కంకణం
ఓసారి ఒక ముసలిపులి ఒక చెరువులో స్నానం చేసి చేతిలో దర్భలు పట్టుకొని చెరువు ఒడ్డున కూర్చున్నది.ఎలా సంపాదించిందో గాని దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంది.అది చేతిలో పుచ్చుకొని కూర్చొని ఉంది. ఆ దోవంటే ఓ బాటసారి నడిచి వస్తున్నాడు.పులి బాటసారిని పలకరించి,అతను భయపడుతుంటే భయపడొద్దని చెప్పింది.'నాయనా, ఇదుగో ఈ బంగారు కంకణం నాకు ఉపయోగపడదు. దీన్ని నీలాంటి వారికి దానం చెద్దామని ఇక్కడ కాచుకొని కూర్చున్నాను. నేను ముసలి పులిని.నా వల్ల నీకు ఏ భయమూ లేదు. వచ్చి కంకణం తీసుకెళ్ళు' అని పిలిచింది.భటసారికి బంగారం చూడగానే ఆశ కలిగింది.
'ఈ రోజు నా అదృష్టం బాగుంది. అందుకే అయాచితంగా బంగారు కంకణం దొరుకుతుంది' అనుకొని బాటసారి ధైర్యం చేసి, కొంచెం దగ్గరికి వచ్చాడు.'ఇదిగో చూడు,బంగారు కంకణం! మేలిమి బంగారం ఏల మెరుస్తున్నదో' అని పులి చేతిలో కంకణాన్ని ఊపుతూ, బాటసారిని మరింత ఊరించింది.
మరింత దగ్గరికి వెళ్ళడానికి బాటసారి జంకాడు.'బంగారు మేలిమి బంగారమే కానీ నువ్వే క్రూర జంతువువి. నిన్ను నమ్మడమెలా?' అన్నాడు.
పులి అన్నది ' ఓ బాటసారీ! నేను చిన్నప్పుడు చాలా పాపాలూ,తప్పుడు పనులు చేశాను.ఎన్నో ఆవుల్నీ, ఎంతమందినో మనుషుల్నీ చంపి తినేశాను.నా పాపాల వల్లే నా భార్యాపిల్లల్ని పోగొట్టుకున్నాను. ఎకకినయిపోయ్యానూ. ఓ రోజు ఒక పుణ్యాత్ముడు కనిపించాడు. జీవితంలో ఇక ముందెప్పుడూ అలాంటి పాపాలు చేయకుండా మంచిగా బతకమని ఉపదేశం చేసాడు. ఆరోజు నుండి నేను జీవహింస చేయకుండా పవిత్రంగా బతుకుతున్న.పైగా ఇప్పుడేమో పూర్తిగా ముసలితనం వచ్చేసింది. పళ్ళు ఊడిపోయినయ్. గోళ్ళు లేవు.మునుపటిలా బలం లేదు.నా వల్ల నీకు ఏ ప్రమాదం లేదు. నన్ను నమ్ము. నువ్వేమో పేదవడివి, మంచివాడివి.కనక నీకు న దగ్గరున్న బంగారం దానం చేసి పుణ్యం సంపాదించుకొంటాను.నువ్వు ఈ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ దానం తీసుకో '.
బాటసారికి ఇది విని ఇంకా ఆశ పెరిగింది. ' నిజమే, ముసలి పులి చావడానికి సిద్దంగా ఉంది.తననేం చేస్తుంది? వదిలేసి పారిపోతే, బంగారు కంకణం చెయ్యిజారిపోతుంది.ప్రతి దానికి భయపడితే ఎలా?' అనుకున్నాడు. పులి చెప్పినట్లు,స్నానం చేసేందుకు చెరువులో దిగాడు.ఆ చెరువులో పెద్ద ఊబి ఉంది.ఆ లోతయిన ఊబిలో బాటసారి ఇరుక్కుపోయాడు.బయటకి రాలేకపోయాడు.
' అయ్యో, ఊబిలో దిగిపోయావా? నేను బయటికి లాగుతాను. చెయ్యి యివ్వు' అంది పులి. బాటసారి పులి చేతిలో చిక్కిపోయాడు.పులి అతన్ని చెయ్యి పట్టి లాగేసి, చంపి, తినేసింది.బాటసారి ఆశకుపోయి అలా ఊబిలో చిక్కుకోకపోతే,అతని వెంబడి పరిగెత్తే బలం పులికి లేదు. అందుకే అది ఈ ఎత్తు వేసింది.దురాశ వల్ల బాటసారి పులికి బలి అయిపోయాడు.
"అంచేత తొందరపడి ఏ పని చేయరాదు. ఆలోచించి పనులు చేసుకొంటే ప్రమాదాల్లో చిక్కుకోకుండ చల్లగా బతకొచ్చు. పదండి, వెళ్లిపోదాం"అన్నాడు చిత్రగ్రీవుడు.
ఆ పావురాల గుంపులో ఓ ముసలి పావురం ఉంది. చిత్రగ్రీవుడి మాటలు విని పెద్దగా నవ్వింది."ఏమి పిరికి రాజువయ్యా, పిచ్చి పిచ్చి కథలు చెబుతున్నావు. ఇలాంటి సందర్భాల్లో వయసుమళ్ళిన నాలాంటి అనుభవజ్ఞుడి మాట వినాలి. ఊరికే ప్రతి విషయానికి ఇలా భయం
పెట్టుకోకూడదు.ప్రతిదానికీ భయపడితే తిండి ఎలా దొరుకుతుంది? తిండి లేకుండా బ్రతకడం ఎలా? అసుయపడేవాడు, అన్నీ అసహ్యిచికొనేవడూ, ఎప్పుడూ విచారిస్తూ కూర్చునేవాడూ, కోపిష్ఠివాడూ, ప్రతిదానికీ సందేహించేవాడూ,పరుల సొమ్ము తిని బతికేవాడూ అనే ఈ ఆరు రకాల మనుషుల,ఎప్పుడూ దుఃఖమే కలుగుతుంది. సుఖంగా ఉండాలంటే ఈ గుణాలు వదిలేయాలని పెద్దవాళ్ళు చెప్తారు. అంచేత సందేహించటం మాని, కిందకు దిగి ఆ నూకలు కడుపునిండా తిందాం పదండి' అంది.
పావురాలన్నీ ఆ మాట మీద బిలబిలా దిగిపోయి నూ ఆశపడి, బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి.
చూశారా, దురాశ వల్ల ఎంత ప్రమాదమో! అన్ని తెలిసినవాళ్ళు, తెలివైనవాళ్ళు కూడా అప్పుడప్పుడూ దురాశపడి ఆపదలో చిక్కుకొంటారు.
కానీ, దాంతో కథ అయిపోలేదు.
చిత్రగ్రీువుడి ఉపాయం
వలలోపడ్డ పావురాలన్నీ తప్పు సలహా చెప్పిన ముసలిపావురాన్ని బాగా తిట్టేశాయి. “నువ్వు పెద్దవాడివని నీ మాట విని ఇలా యిరుక్కుపోయం. తెలివితేటలున్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ కేవలం వయసు పెరగ్గనే ’పెద్దతనం ఎలా వస్తుంది?” అని తిట్టిపోశాయి. చిత్రగ్రీవుడు ఆ పావురాలని వారించాడు. “ఇది మన ముసలిపావురం తప్పుకాదు. ఆపద వచ్చే సమయంలో మంచి సలహాకు కూడా చెడ్మే ఉంటుంది. మన కాలం సరిగా లేకపోతే, యిలాంటి యిబ్బందులొస్తాయి. దాన్ని నిందించి లాభం లేదు. అది సలహా చెప్తే మాత్రం మన తెలివేమయి పోయింది? ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు బయటపడే మార్గం చూసుకోవాలి. కానీ, యిలాంటి మాటల వల్ల ఏమిటి లాభమ్? ధైర్యం తెచుకొని, యిందులోంచి బయటపడే మార్గం ఆలోచించండి. నాకయితే ఓ ఉపాయం కనిపిస్తున్నది. చెప్తా వినండి. ఒక్కసారిగా మనందరం కలిసి ఈ వలని ఎత్తి ఎగిరిపోదాం. ఇంత చిన్న పాపురాలం, ఇంత 'పెద్ద వలను ఎలా ఎత్తుతామని కంగారుపడద్ధు. పదిమందీ కలిస్తే ఎంత పెద్ద పనయినా యిట్టే చేసేయచు. గడ్డిపరక ఎ౦త సన్నగా ఉన్నా కొన్ని గడ్డిపరకలని కలిపి తాడుగా పేనేస్తే, ఆ తాడుతో
'ఎనుగుని కూడ కట్టేయెుచు. ఆలోచించండి. మీకు ఇంతకంటే మంచి ఉపాయం ఏదయినా తడితే చెప్పండి” అన్నాడు.
ఎంత ఆలోచించినా ఆ పాపురాలకు అంతకంటే మంచి ఉపాయం మరోటి తట్టలేదు. సరే, చిత్రగ్రీవుడి ఉపాయమే బాగుందని నిశ్చయం చేసుకొని, అవన్నీ కలిసి ఒక్కుమ్మడిగా ఎగిరాయి, వలతో సహా!
పొదలోనించి చూస్తున్న బోయవాడు, యిది చూసి బిత్తరపోయాడు. “అరె, ఎంత ఆశ్చర్యం! యిలా పిట్టలు వలతో సహా ఎగిరిపోవటం ఎప్పుడూ చూడలేదు. ఏం తెలివి! అయినా, యివి యిలా ఎంత దూరం పోతాయో అదీ చూస్తాను” అనుకొంటూ ఆకాశంలో ఎగురుతున్న పావురాలను చూస్తూ, వాటి వెంట తను భూమి మీద పరిగెత్తసాగాడు.
ఈ వింతంతా చూస్తున్న లఘుపతనకుడు (మరిచిపోయారా, మన కథ మొదట్లో వచ్చిన కాకి) కూడా ఆ పావురాల వెంబడి ఎగురుతూ వెళ్ళాడు. పక్షులు చూఫుమేర దాటగానే, ఇక భోయవాడు నిరాశ పడిపోయి ఇంటికి వెళ్లిపోయాడు.
“ఇప్పుడేం చేద్దాం? ఇలా ఎంత దూరం వెళతాం?” అని అడిగాయి, పావురాలు చిత్రగ్రీవున్ని..
“లోకంలో తల్లీ, తండ్రీ, స్నేహితుడూ ఈ ముగ్గురే కాపాడేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా వాళ్ళకు ప్రయోజనం ఉంటేనే మన సంగతి పట్టించుకుంటారు. నాకో స్నేహితుడున్నాడు. వాడు ఎలుకల రాజు. గండకీవది ఒడ్డున విచిత్రవనమనే అడవిలో ఉంటాడు. వాడు ఈ వల తాళ్ళను కొరకగలడు. అక్కడికి పోదాం పదండి” అన్నాడు చిత్రగ్రీవుడు.
పావురాలన్నీ ఒప్పుకొని ఎగురుతూ వెళ్ళి హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. పావురాల గుంపు చేసే గోల విని హిరణ్యకుడు ముందు భయపడిపోయాడు. కలుగు లోపలికి వెళ్ళి దాక్కున్నాడు.
అప్పుడు చిత్రగ్రీవుడు కలుగు దగ్గిరగా వెళ్ళి “మిత్రమా, నేను నీ చెలికాడినే. చిత్రగ్రీవుడిని. నువ్వు భయపడాల్సిన పని లేదు. బయటికి వచ్చి నాతో మాట్లాడివెళ్ళవా?” అన్నాడు.
హిరణ్యకుడు చిత్రగ్రీవుడి గొంతు పోల్చేసుకొన్నాడు. చటుక్కున బయటికి వచ్చాడు. చిరకాల మిత్రుడిని చూచి ఎంతో సంతోషించాడు. ‘ఆహా! ఎంత అదృష్ఠం, చిత్రగ్రీవుడా, ఎన్నాళ్ళ తరువాత కనిపించావయ్యా! అయినా ఈ వలలో చిక్కుకొనిపోయి ఉన్నావేమిటి?’ అని ఆప్యాయంగా, ఆత్రంగా పలకరించి వల తాళ్ళు కొరకబోయాడు.
“పూర్వజన్మలో చేసిన ఏవో పాపాలకు ఇప్పుడీ ఫలం అనుభవిస్తున్నాను. చేసిన కర్మకు శిక్ష తప్పదులే. అయినా నువ్వు ముందు విడిపించాల్సింది నన్ను కాదు. నాతోటి పావురాలని ముందు విడిపించి, తరువాత నన్ను బయట పడేయటం న్యాయం” అన్నాడు.
హిరణ్యకుడు, “నా పళ్ళు కొంచెం సున్నితంగా ఉన్నయ్. ఈ వల తాళ్ళన్నీకొరికేసే శక్తి నాకు లేదనుకొంటాను, ముందు నిన్ను విడిపించనియ్యి. తర్వాత శక్తి ఉన్నంత వరకూ వల తాళ్ళు కొరికేసి,మిగిలిన పావురాలనీ కూడా రక్షిస్తాను" అన్నాడు.

చిత్రగ్రీవుడు మంచితనానికీ, సద్బుద్దికీ మారుపేరు, “అలాగయితే, హిరణ్యకా, ముందు శక్తీ ఉన్నంతవరకూ మిగిలిన పావురాలని బయటికి రప్పించు. ఇంకా శక్తి ఉంటే, అప్పుడే నా సంగతి చూసుకొందాం” అన్నాడు.
“నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది. ‘తనకు మాలిన ధర్మము, మొదలు చెడ్డ బేరము’ అని సామెత ఉండనే ఉంది గదా! నీ బాగోగులు మర్చిపోయి, నీ వాళ్ళను రక్షిస్తానంటే ఎలా?నువ్వు క్షేమంగా ఉంటేనే నీ వాళ్ళ సంగతి చూస్తావు నువ్వే బ్రతక్కపోతే, ఇంకా వాళ్ళెవరూ, నువ్వెవ్వరూ?” ప్రశ్నించాడు హిరణ్యకుడు.
“అది నిజమే. కానీ నా వాళ్ళు కష్టంలో ఉంటేచూసి సహించటం నా వల్లకాదు. మాంచివాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, నీ జీవితం దారపోసి అయినా వాళ్ళను రక్షించటం కర్తవ్యమని పెద్దలు చెప్పారు. నాలాంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళలాంటి వాడిని నేను. వీళ్ళని ఆపదలోనించీ రక్షించకపోతే, నా రాచరికం వల్ల ఏమిటి వీళ్ళకు లాభం? ఏదో ఓ రోజు ఎలాగో నశించిపోయే ఈ శరీరం మీద అంత మోజు మానుకొని, నాలుగు కాలాల పాటు మంచిపేరు నిలిచిపోయేలా నలుగురికి ఉపకారం చేయటమే మంచిదని నాకనిపిస్తున్నది. అంచేత ముందు నా వాళ్ళని కాపాడు. తర్వాతే నన్ను” అన్నాడు చిత్రగ్రీవుడు.
చిత్రగ్రీవుడి మంచితనం చూచి హిరణ్యకుడికి ఎంతో ఆనందం కలిగింది. “చెలికాడా, ఎంత మంచి బుద్ధి నీది!నువ్వు మంచిచెడ్దలు బాగా తెలిసినవాడివి. నువ్వసలు మూడు లోకాలకూ రాజు కావాల్సినంత బుద్దిమంతుడివి” అని మెచ్చుకొని మెల్లిగా వల తాళ్ళన్నీ కొరికేసి, తన వాళ్ళ సహాయంతో పావురాలన్నింటికీ చక్కటి ఆతిథ్యం యిచ్చి సాగనంపాడు..
లఘుపతనకుడు-కాకి
చిత్రగ్రీవుడు-పావురాల రాజు
హిరణ్యకుడు-ఎలుక
ధన్యవాదాలు.
కొనసాగుతుంది...
తరువాత కథ: కాకి - ఎలుక
Pls like,share and comment...
ధన్యవాదాలు.
కొనసాగుతుంది...
తరువాత కథ: కాకి - ఎలుక
Pls like,share and comment...