ఆపాయంలో కపోతాలు

         ప్రియమైన వ్యువర్స్ ఈ కథ అర్థం కావాలంటే నేను మొదట పోస్ట్ చేసిన కథని చదవండి మీకే అర్థమవుతుంది...


                                 మిత్ర లాభం





“రాజకుమారులారా, మన దగ్గర డబ్బూ, మంది, మార్బలం లేకపోయినా, మంచివాళ్ళు నలుగురు మనకు స్నేహితులుగా ఉంటే అనుకొన్న పనులు నెరవేర్చుకోవచ్చు. పాతరోజుల్లో ఓ కాకీ, తాబేలూ, జింకా, ఎలుకా స్నేహం చేసుకొని సుఖంగా బతికిన కథ ఒకటుంది , అది మీరు విన్నారా?” అన్నాడు విష్ణుశర్మ. ’ పిల్లలు కథలంటే చెవి కోసుకొంటారు కదా! “గురువుగారూ, ఆ కథేదో మాకు పూర్తిగా చెప్పండి” అన్నారు రాజుగారి కొడుకులు. విష్ణుశర్మ కథ చెప్పడం మొదలెట్టారు.



              ఆపాయంలో కపోతాలు 


గోదావరి గట్టుమీద ఓ పెద్ద బూరుగచెట్టు ఉంది దాని మీద ఎన్నో పిట్టలు గూళ్ళు కట్టుకొని నివసించేవి.పగలు తిండి కోసం తిరిగి, తిరిగి రాత్రికి గూటికి చేరేవి. ఆ పక్షులలో ఒక కాకి ఉండేది. దాని పేరు లఘుపతనకుడు.

ఓ రోజు తెల్లవారుతుండగానే కాకి మామూలుగా నిద్ర లేచింది. లేస్తుండగానే ఆ చెట్టు దగ్గర్లో తిరుగుతున్న భోయవాణ్ణి చూసింది.

“అయ్యో, పొద్దున్నే లేవగానే వీడి మొహం కనిపించింది. ఇదో అపశకునం. ఇవాళ ఏదో ఆపద కలగక తప్పేట్టు లేదు, వీలయినంత తొందరగా ఈ గూడు వదిలిపెట్టి దూరంగా పోయి, మళ్ళీ సాయంత్రం దాకా ఈ ఛాయలకు రాకూడదు, వీడి కంట్లో పడితే చంపేస్తాడు” అని బయల్దేరబోయింది.

బోయవాడు చెట్టు దగ్గిర్లో రెండు గుప్పెళ్ళు నూకలు చల్లి, వాటిమీద తన వల పరిచేసి, దూరంగా వెళ్ళి ఒక పొరలో దాక్కున్నాడు. ఆ నూకల కోసం ఏవయినా పిట్టలు వాలి, వలలో పడగలవని వాడి ఆశ.

కొంచెం సేపయిన తర్వాత, ఓ పావురాల గుంపు ఆకాశంలో ఎగురుతూ ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ పావురాల గుంపుకు ఒక రాజు. అతని పేరు చిత్రగ్రీవుడు. చిత్రగ్రీవుడు నేలమీద చల్లిన నూకలు చూశాడు. ఎత్తునించీ వల కనబడలేదు. కానీ చిత్రగ్రీవుడికి అనుమానం వచ్చింది. ఈ అడవిలాంటిచోట నూకలెలా వచ్చాయని. తోటి పావురాలతో ఇలా అన్నాడు : “ఈ అడవిలో ఇలా నూకలు చల్లి ఉన్నయంటే, ఇందులో ఏదో మోసం ఉంది. మనం వీటికి ఆశ పడకూడదు, అలా ఆశపడితే ప్రమాదం ఖాయం. ఆశపడి వెనకటికి ఓ బాటసారి అన్యాయంగా ముసలిపులి చేతిలో చిక్కి చచ్చిపోయాడు‘ ఏమఇందో తెలుసా? ఆ కథ చెప్తాను వినండి.
                    లఘుపతనకుడు-కాకి
                    చిత్రగ్రీవుడు-పావురాల రాజు
                                                     ఇంకా ఉంది.....

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...