అనగా అనగా ఒక దేశం . ఆ దేశనికి రాజు సుదర్శనుడు, అతని రాజధాని పాటలీపుత్రం. ఆయనకు సుఖసౌఖ్యాలకు కొదవేమీ లేదు. కానీ ఏదో ఒక దిగులు లేకుండా మనిషి ఉండడు కదా? ఆయన దిగులు తన పిల్లల గురించి.
ఆయన కొడుకులు బుద్దిమంతులే. కానీ గారాబం వల్ల, చిన్నతనం వల్లా ఎప్పుడూ ఆటలలో మునిగిపోయి, మిగిలిన విషయాలు అశ్రద్ధ చేసేవాళ్ళు.వాళ్ళు సరిగ్గా చదువులు చదువుకొని, శాస్త్రాలు నేర్చుకోవటం లేదని రాజుగారు ఎప్పుడూ దిగులుపడుతూ ఉండేవాడు. , ఓరోజు రాజుగారు తన కొలువులో కూర్చొని, వచ్చిన పండితులతో మాట్లాడుతుండగా, ఒక విద్వాంసుడు వచ్చి రెండు మంచి పద్యాలు చదివాడు. ' పరువంబు, కలిమి, దొరతన మరయమి యనునట్లీ వీని యందొకడొకడే
పొరయిన్చు ననర్థమువా
బరగినవో నాల్గు చెప్పవలయునె చెపుమా
పలుసరిదియముల దొలచును
వెలయిన్చు నగోచరార్ధ విజ్ఞానము లో
కుల కక్షి, శాస్త్రమయవ్రది
అలవడదెన్వనికి వాడె అరిధుడు జగతిన్
ధనమూ, అధికరం, కుర్రతనం, అవివేకం అనే ఈ నాల్గిటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీటిలో ఏ ఒక్క దాని వల్లనయినా మనిషి చెడిపోయే ప్రమాదాం ఉంది. నాలుగూ ఉన్నవాడు చెడిపోవటం మరీ తేలిక, అందుకే సరయిన చదువు చదువుకోవటం అవసరం’). దానివల్ల తెలివితేటలూ, వివేకమూ వికసిస్తాయి, మనిషికి విద్యె కన్ను విద్యలేని వాడు గుడ్దివాడితో సమానమే, అని ఆ పద్యాల అర్ధం
పండితుడు చదివిన పద్యాలు విని, రాజుగారికి మరింత దిగులు పెరిగింది. చదువు వదిలేసి, ఎప్పుడూ తోటిపిల్లలతో ఆటలతో కాలక్షేపం చేసే తన సుపుత్రులు గుర్తుకు వచ్చారు..’
“తల్లిదండ్రుల మాట విని చక్కగా చదువుకొని మంచి పిల్లలు అనిపించుకున్నవారు పిల్లలు గానీ, మిగిలిన వాల్లెం పిల్లలు? వాళ్ళ వల్ల తల్లిదండ్రులకెం సుఖం? వంద గులకరాళ్ళకన్నా ఒక్కరత్నం మేలన్నట్టు, వందమంది మూర్ఖుల కన్నా గుణవంతుడయిన కొడుకు ఒక్కడు మేలు, అయినా గుణవంతులూ, విద్యావంతులూ అయిన పిల్లలని చూసి సంతోశాపడే భాగ్యం ఆందరికీ ఉండదు” అని కొంత బాధపడ్డాడు.
అంతలో ఆయనకు మరో ఆలోచన కూడా వచ్చింది. “అసలయినా నేనిలా ఊరికే బాధపడి ఏం లాభం, నేను మంచి గురువులచేత బాగా చదివిస్తానంటే నా పిల్లలు చదవనన్నారా? నేనే అశ్రద్ధచేసి, గారాభం చేసి వాళ్ళ చదువు విషయం నిర్లశ్యం చేస్తున్నాను. పిల్లలకు సరిగా చదువు చెప్పించే ప్రయత్నం చేయటం తల్లిదండ్రుల పని. సరయిన గురువును చూచి, పిల్లలను ఆయనకు అప్పగించక పోవడం నా తప్పు. పిల్లలను బాగా చదివిస్తే విద్వంసులవుతారు తప్ప పుట్టుకతో విద్వాంసులెక్కడ ఉండరు. ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది, ఊరికే ఆశపడటం వల్లా, దిగులుపడటం వల్లా ప్రయోజనం ఉండదు. ఎంత సింహమయినా ఆహారం కావాలంటే వేటాడాలి కాని, నోరు తెరుచుకొని పడుకొంటే ఆహారం నోట్లోకి దూరదు. కనుక మంచి గురువుని వెతకాలి” అనుకొన్నారు.
సభలో కూర్చొన్న పండితులను అడిగాడు : “ఎప్పుడూ ఆటలలో మునిగి, చదువు సంధ్యలు లేకుండా తిరుగుతున్న
నా పిల్లలకు చక్కగా నీతి శాస్త్రం నేర్పి వాళ్ళను మంచి దోవలో పెట్టగలవారు మీలో ఎవరయినా ఉన్నారా?” అని.
విష్ణుశర్మ అనే పండితుడు లేచి నిలబడ్డాడు :
“రాజా! అదంత కష్టం కాదని నేననుకొంటున్నను.
కొంగకు మాటలు నేర్ఫటం కష్టం కానీ చిలకకు నెర్పటం కష్టం కాదు. మీ పిల్లలు రాజవంశంలో ఫుట్టినవాళ్ళు, వజ్రల గనిలో గాజుముక్కలూ ఉండవు.మంచిచివంశంలో గుణహీనులు పుట్టరు. కానీ ఎంత వజ్రాన్నయినా సానపడితేనే కంతివస్తుంది. కనుక ఓ ఆరునెలలు మీ పిల్లల్ని నాకప్పగిస్తే నేను వాళ్ళకు చక్కగా చదువుచెప్పి మంచి మార్గం లో పెడతాను” అన్నాడు.
“మీలాంటి గురువుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులు మంచి యోగ్యులపుతారు. పూలు కట్టిన దారానికి పూలవాసన అబ్బినట్లు, సజ్జనులతో తిరిగిన సామాన్యులు కూడా సన్మార్గంలో మసలుతారు. మంచి సావాసంలో వారు వీరులవుతారు. ఈ పిల్లలకు బాగా విద్యనేర్పి వీళ్ళ కళ్ళు తెరిపించండి” అని రాజు తన పిల్లలను విష్ణుశర్మకు అప్పజెప్పారు.
విష్ణుశర్మ ఆ పిల్లలని తీసుకువెళ్ళి ఒక భవనంలో కూర్చోపెట్టుకొని, “సరదాగా మీకు కొన్ని కథలు చెబుతాను. ఇవి మంచి నీతికథలు, వీటిలో మిత్రలభం, మిత్రబేదం, విగ్రహం, సంధి అని నాలుగు భాగాలున్నాయి. మీరు శ్రద్ధగా వినండి” అంటూ నీతికథలు చెప్పటం ఆరంభించాడు.
కొనసాగుతుంది........
No comments:
Post a Comment