మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...
పావురాలను సాగనంపేసిన తరవాత, హిరణ్యకుడు తన కలుగులోకి వెళ్ళిపోయాడు.
కానీ, ఈ జరుగుతున్న వ్యవహారమంతా పావురాల వెనకాలే వచ్చిన లఘుపతనకుడు చూస్తూనే ఉన్నాడు. ఎలుక పావురాలను విడిపించే వింత సంఘటన చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు.
ఎలుక కలుగు దగ్గర వాలాడు. “హిరణ్యకా! నువ్వు సామామ్యడివి కాదు. జరిగిన కథంతా నేను చూస్తున్నాను. నీలాంటి “స్నేహితులుండటం ఒక ఆదృష్టం. నాక్కూడా నీతో స్నేహం చేయాలనుంది. నాతో జట్టు కట్టరాదా, మనిద్దరం హాయిగా స్నేహంగా ఉండిపోతే, అది యిద్దరికీ మంచిదే కదా?” అన్నాడు.
హిరణ్యకుడు కలుగు లోపల్నుంచి, ‘అసలు నువ్వెవరివొ నాకు తెలియదు. నీతో స్నేహం ఎలా చేస్తాను?’ అని అడిగాడు. ఎవళ్ళ భటం వాళ్ళది. ‘నేను ఒక కాకిని. నా పేరు లఘుపతనకుడు” అని కాకి జవాబు.
“సరి సరి, నీతో నాకు ‘స్నేహం ఎలా కుదురుతుంది? అసలు కాకుల పనే ఎలుకల్ని వెతికి, చంపి తినటం. నేను బయటికి రాగానే నువ్వు నన్ను చంపేసి తినేస్తావు. ఎవరికి తగినవాళ్ళతో వాళ్ళు స్నేహం చేయాలి. నీతో ‘స్నేహానికి నేను ఒప్పుకొంటే, నా చావు నేను కోరి తెచ్చుకొన్నట్లే. మనిద్దరికీ 'స్నేహం కుదరదు. వెనకటికియిలాగే ఒక జింక, ఓ నక్కతో ‘స్నేహం చేసి ప్రొణం పోగొట్టుకొన్న కథ అందరికీ తెలుసు గదా?” అన్నాడు హిరణ్యకుడు.
“అదేం కథ? నాకు తెలియదు, నాకు చెప్పవా?” అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడు కాకికి కథ చెప్పాడు.
ధన్యవాదాలు...
ఇంకాఉంది...
తరువాత కథ:జిత్తులమారి నక్క..
Please share and comment...
కాకి-ఎలుక

No comments:
Post a Comment