తాబేలు - నక్క
అనగనగా ఒక ఊళ్ళో ఒక నది ఉంది. ఆ నదిలో ఓ తాబేలు ఉంది. ఓరోజు మధ్యాహ్నం తాబేలు తీరానికి వచ్చి, ఓ చెట్టు కింద కాసేపు పడుకొంది. ఆ నదిలో నీళ్ళు తాగడానికి వచ్చిన ఒక నక్క ఒడ్డున పడుకొని ఉన్న తాబేలును చూసింది. "ఆహా! ఇవాళ మంచి ఆహారం దొరికింది" అనుకొంటూ తాబేలు మీద కాలు వేసింది. ఆ ఒత్తిడికి తాబేలుకు మెలకువ వచ్చింది. తాబేలు కాళ్ళూ, చేతులూ, తలా వగైరా భాగాలు మెత్తగా ఉంటాయి గాని, వీపు రాతి చిప్పలా ఉంటుంది. ప్రమాదం తోచినప్పుడు తాబేలు తన శరీరాన్నంతా ఆ చిప్ప లోపలికి లాక్కుని కూర్చొంటుంది. ఆ స్థితిలో ఆ చిప్ప బద్దలుకొట్టి వీలుకాదు. లోపల . మెత్తటి మాసం తినటం ఏ జంతువుకూ
నక్క కాలు తన మీద పడగానే తాబేలు శరీరాన్నంతా లోపలికి లాక్కుంది. నక్క ఎంతసేపు తిప్పలు వద్దా, తాబేలు కవచాన్ని ఛేదించలేకపోయింది. కొంతసేపయింతర్వాత తాబేలే నక్కతో యిలా అంది. "నువ్వు నన్ను పట్టుకొన్నప్పుడే నాకు ప్రాణాల మీద ఆశపోయింది. నీలాంటి మహానుభావుడికి ఆహారం అవటం నాకూ యిష్టమే. కానీ, నువ్వు యిలా వృధాగా శ్రమపడుతుంటే నాకు బాధగా వుంది. నా వీపు రాయి లాంటిది. నువ్వెంత శ్రమపడ్డా నీకు స్వాధీనంలోకి రాదు. ఒక ఉపాయం చెప్తాను, విను. నన్ను ఆ నీళ్ళలో కాసేపు ఉంచావంటే, నా శరీరం నాని, మెత్తపడుతుంది. అప్పుడు నన్ను నువ్వు తేలిగ్గా చంపొచ్చు!”
ఉపాయం బాగానే ఉంది కాని నక్కకు అనుమానం. అసలే తాబేలు నీటి జంతువు. నీళ్ళలోకి జారిపోతే మళ్ళీ తనకు దొరుకుతుందా? మరి, నీళ్ళలో ముంచకపోతే దాని శరీరం మెత్తబడేదెలా? మధ్యే మార్గంగా, నక్క తాబేలును నీళ్ళలోకి లాగి, కదలకుండా తన కాళ్ళు దాని వీపుమీదే వేసి అదిమిపెట్టింది.
అలా రెండుగంటలు గడిచినా తాబేలు మెత్తబడలేదు. "నానితే మెత్తపడతానన్నావు, ఎంతకూ మెత్తపడవేం?" అని అడిగింది నక్క.
"అయ్యో రాత! నువ్వు అలా కాళ్ళు వేసి కూర్చొంటే. నా వీపుకు నీళ్ళెక్కడ తగులుతున్నయ్ నానటానికి. కాసేపు ఆ కాళ్ళు తీసెయ్. పదినిమిషాల్లో మెత్తబడతాను" అంది తాజేలు. "అలాగా!" అని నక్కకాలు తీయగానే, తాబేలు నీళ్ళలో ఈదుకుంటూ పారిపోయి, ప్రాణం కాపాడుకొంది.
ఇలా ఆ ముసలిదొంగ కథలు చెపుతూ, "మోసంతో ఏ పనయినా చేయచ్చు. ఈ మేకని దొంగిలించడం పెద్ద ఘనకార్యం కాదు. నేను తేలిగ్గా సాధిస్తాను. అయితే మీరందరూ నాకో చిన్న సహాయం చేసి పెట్టండి. మీరు ఈ బ్రాహ్మడి దోవలోనే వెళ్ళి కొంచెం దూరం, దూరంగా అక్కడక్కడా కావు వెయ్యండి. బ్రాహ్మడు మీ దగ్గరికి రాంగానే 'ఏమయ్యా బ్రాహ్మడా! నల్లకుక్కనిలా తీసికెళ్తున్నావేమిటి?' అని అడగండి. చాలు, మిగిలింది నేను చూసుకొంటాను" అన్నాడు.
అలాగే బ్రాహ్మణుడు మేకని తీసుకుపోతూ కొంతదూరం వెళ్ళిన తర్వాత ఒక దొంగ అతన్ని పలకరించి. "అయ్యో! నువ్వు చూడబోతే బ్రాహ్మడివి. యిలా కుక్కను తోలుకుపోతున్నావేమిటి?” అన్నాడు.
బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. "ఛీ తాగుబోతా! నేను యజ్ఞానికని పవిత్రంగా నల్లమేకను తీసుకెళ్తుంటే, నీ తాగుడు మైకంలో అది నీకు కుక్కగా కనిపిస్తున్నదా? పక్కకి ఫో, నా దోవకు అడ్డు రాకు!” అంటూ తిట్టి ముందుకుసాగాడు.
మరోమైలు నడిచిన తర్వాత, మరొక దొంగ ఆయన్ని పలకరించాడు. "స్వామీ, అన్నీ తెలిసిన బ్రాహ్మలై యుండి నల్లకుక్కని తాకటమే కాక మీతో తీసుకెళుతున్నారేమండీ?” అన్నాడు. బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది, ఏమిటి ఇద్దరు బాటసారులు యిదే పిచ్చిప్రశ్న వేశారని, జవాబేమీ చెప్పకుండా తన దోవన తను నడిచాడు.
మరో మైలు గడచిన తర్వాత మరో దొంగ ఎదురయ్యాడు “ఇదేం పనయ్యా బాపడా! ఛీఛీ నల్లకుక్కని తీసుకెళుతున్నావు. అదీ నిర్భయంగా, పట్టపగలు! ఎవరయినా చూస్తారని కూడా భయం లేదా? ఆచారాలన్నీ యిలా మంటగలుపుతావేమయ్యా?" అన్నాడు.
ఒకరికి యిద్దరు, యిద్దరికి ముగ్గురూ ఇలా అడిగేసరికి బ్రాహ్మణుడికి నిజంగానే అనుమానం వచ్చింది, మతిచెదిరి, భ్రాంతి వల్ల తను మేక అనుకొని కుక్కను గానీ కొనలేదు గదా అని.
మరో అరమైలు నడిచిన తర్వాత, అతనికి మరో యిద్దరు దొంగలు ఎదురయ్యారు. వాళ్ళల్లో ముసలిదొంగ, రెండోవాడితో "చూశావురా! ఈయనెంత పిచ్చి బ్రాహ్మడో. ఈయన్ని అమాయకుణ్ణి చేసి, సంతలో ఎవడో గడుసువాడు. ఈయనకు నల్ల కుక్కని అమ్మేశాడు. అదే మేక అనుకుని ఈయన ఇంటికి తీసుకెళుతున్నాడు. ఆయన అవస్థ చూడు. తీరా తన ఊరు చేరితే అందరూ పాపం ఈయన అమాయకత్వం చూసి నవ్విపోవటమే గాక ఈయన్ని వెలివేస్తారో ఏం పాడో!” అన్నాడు.
దాంతో బ్రాహ్మణుడికి తను పొరపాటుపడి మేక బదులు కుక్కని కొని తెచ్చుకొన్నానని రూఢి అయిపోయింది. మేకని వదిలేసి, దగ్గర్లో ఉన్న చెరువులో దిగి స్నానం చేసి, తడిబట్టలతోనే ఇంటికిపోయి పాప పరిహారం కోసం గాయత్రీమంత్రం జపించుకొంటూ కూర్చొన్నాడు.
దొంగలు మాత్రం నవ్వుకుంటూ, మేకను తీసుకెళ్ళి హాయిగా వండుకుని తినేశారు.
“అందువల్ల నమ్మినవాళ్ళనూ, అమాయకులనూ, మోసగించటం అంత కష్టంకాదు. హిరణ్యగర్భుడు అలాగే నావల్ల మోసపోయాడు కానీ, అతను చాలా బలవంతుడూ, బుద్ధిమంతుడూ, సమర్థుడూ అనటానికి సందేహం లేదు. అతని మంత్రి సర్వజ్ఞుడు కూడా అంతే” అన్నాడు మేఘవర్ణుడు.
"అవును, శత్రువుల మధ్య కొన్ని నిముషాలూ, గంటలూ ఉండటమే చాలాకష్టం. నువ్వు అన్ని రోజులు శత్రువుల మధ్య ఎలాగ ఉండగలిగావు, మేఘవర్ణా?” అని చిత్రవర్ణుడు మరో ప్రశ్నవేశాడు.
"కార్యార్థి అయిన సమర్థుడు ఎన్ని కష్టాలొచ్చినా, శత్రువుని తన నెత్తిన పెట్టుకొని మోసి కూడా, చివరికి తన పని సాధించుకొంటాడు. దీనికి దృష్టాంతంగా లోకంలో 'పాము కప్పలు' కథ చెప్తారు" అంటూ మేఘవర్ణుడు ఆ కథ చెప్పటం ప్రారంభించాడు.
No comments:
Post a Comment