సంధి
మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం కథలు చాలా ఆసక్తితో విన్నారు రాజకుమారులు. “గురువుగారూ, మీరు చెప్పిన మూడు కథలూ చాలా బావున్నాయి. 'సంధి' అని నాలుగో కథ కూడా ఉందన్నారు. అది కూడా చెప్పరా?” అన్నారు. విష్ణుశర్మ వాళ్ళకు 'సంధి' కథ కూడా చెప్పాడు.
విగ్రహం కథలో కర్పూరద్వీపంలో నీటిపక్షుల హంసరాజు హిరణ్యగర్భుడికీ, ఎక్కడో జంబూద్వీపంలో నేలపక్షుల నెమలిరాజు. చిత్రవర్ణుడికీ ఉత్తపుణ్యానికి జరిగిన భయంకరమయిన యుద్ధం గురించి చెప్పుకొన్నాం. రెండు పక్షాలలోనూ ఎంతో ప్రాణనష్టం జరిగింది. ఎన్నో పిట్టలు చచ్చిపోయాయి. ఓ పక్కన హిరణ్యగర్భుడూ, యుద్ధంలో ఓడిపోయి, అటూయిటూ పారిపోయిన అతని సైనికులు కొందరూ మిగిలారు. మరో పక్కన చిత్రవర్ణుడూ అతని పక్షాన చచ్చినవారు చావగా మిగిలిన సైనికులూ ఉండిపోయారు. కొంతకాలం గడిచిన తర్వాత, ఈ రెండు పక్షాలకూ సంధి కుదిరి మళ్ళీ స్నేహితులయ్యారు. ఇప్పుడు చెప్పబోయే కథంతా ఆ సంధి గురించి.
No comments:
Post a Comment