కోతులు - కుందేలు
మాల్యవంతమనే పర్వతం మీద ఒక ఉండేది. ఒకసారి ఆ అడవిలో కొన్ని కోతులు దాహం తీర్చుకోవడానికి వెతుకుతూ చాలాసేపు తిరగాల్సి వచ్చింది. ఎండమావుల వెనక తిరిగి, తిరిగి నీళ్ళు దొరకక, చాలా అలిసిపోయి కోతులన్నీ ఓ మర్రిచెట్టు కింద కూలబడ్డాయి. వాటిలో ఒక కొండముచ్చు యిలా అంది : 'చూశారా! మనం నీళ్ళ కోసం తిరుగుతూ, తిరుగుతూ మన స్థావరం నించీ ఏడెనిమిది మైళ్ళు వచ్చేశాం. ఎండవేడికి కాళ్ళు బొబ్బలెక్కాయి. నాలుక పిడచకట్టుకుపోయింది. అడుగు తీసి వేసే ఓపిక లేదు. నీళ్ళు దొరకనే లేదు. ఇప్పుడేం చేయాలి?'
ఆ మర్రిచెట్టు తొర్రలో ఓ కుందేలుంది. పాపం ఆ మాటలు విని దానికి ఆ కోతుల మీద జాలివేసింది. తొర్రలోంచి బయటికొచ్చి 'పిచ్చి కోతుల్లారా! మీరు పాపం అనవసరంగా ఎండమావులు చూసి, వాటిలో నీళ్ళు దొరుకుతాయని భ్రమపడి పరుగెట్టి అలసిపోయారు. మీకు నీళ్ళు కావాలంటే, అల్లదిగో, ఆ దిక్కున, పల్లంలో, దగ్గర్లోనే ఓ చెరువుంది. అక్కడికి పోయి | దాహం తీర్చుకోండి' అని చెరువున్న దిక్కు చూపించింది.
మంచి సలహా చెప్పినందుకు కోతులు సంతోషపడలేదు. సరికదా! చాలా కోపం తెచ్చుకున్నాయి. వాటిలో ఒక కోతి కుందేలు వెనక కాళ్ళు పట్టి పైకెత్తి, "విన్నారా! ఈ కుందేలు మనల్ని ఎన్ని తిట్లు తిట్టిందో, మనకు తెలివిలేదట. తెలివి దీనికే ఉన్నదట. ఇది చెప్తే తప్పా మనకు తెలీదట. చూశారా, దీని పొగరు?' అంటూ, దాన్ని నేలకు వేసి కొట్టి, కొట్టి చంపేసింది. తరువాత కోతులన్నీ కుందేలు చూపించిన చెరువు దగ్గరికి వెళ్ళి, హాయిగా దాహం తీర్చుకొని చక్కాపోయాయి!
నీతి ఏమిటంటే మూర్ఖులకు హితవు చెప్పే ప్రయత్నం చేస్తే అది ప్రమాదం.
సరే, మళ్ళీ మన కథకి వస్తే, ఆ జంబూద్వీప పక్షులన్నీ నన్నూ, మిమ్మల్నీ బాగా తిట్టిపోసి, 'దుర్మార్గుడా, నువ్వు మా దేశానికి వచ్చి, మమ్మల్నే నిందిస్తావా? మీ రాజు గొప్పలూ, మీ ఊరి గొప్పలూ గోరంతలు కొండంతలు చేసి, నీ పక్షపాత బుద్ధి చూపించుకొన్నావు. ప్రపంచమంతా మెచ్చుకొన్న మా రాజు చిత్రవర్ణుడు నీకు నచ్చదు. మీ హంసరాజు, మేఘం కనిపిస్తే భయం వేసి పారిపోయే పిరికివాడు, పెద్దవీరుడా? మీ హిరణ్యగర్భుడి వంటి రాజులు వెయ్యి మందయినా మా చిత్రవర్ణుడికి సాటిరారు. నీ సలహా ఏడిచినట్టుంది. నువ్వే మా మాట విను. నువ్వూ, మీ రాజూ కలిసి మా రాజు దగ్గర ఆశ్రయం పొంది బతకండి' అని నోటికొచ్చినట్టు మాట్లాడాయి.
నాకు, ఆ మాటలు విని, చాలా కోపమొచ్చింది. అయితే, అప్పటికి చేసేదేమీ లేక, అతి కష్టం మీద నా కోపం కప్పిపుచ్చి యిలా అన్నాను: “ఇవేం మాటలు! నా అభిప్రాయం చెప్పమని అడిగింది మీరు. అడిగారు కదా అని నాకు తోచింది. చెప్పాను. నచ్చితే వినండి, లేకపోతే మానేయండి. అంతేకాని, యిలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మా రాజు గొప్పతనం. మీకేం తెలుసు? నిష్కారణంగా ఆ మహానుభావుణ్ణి తిట్టి, పాపం కట్టుకొంటున్నారు. నోటి దురుసుతనం మంచిది కాదు. మీరు రాళ్ళు రువ్వితే నేను పూలు రువ్వుతాననుకోకండి. మా రాజు సంగతి తరువాత మాట్లాడచ్చు. ముందసలు ఈ నెమలిని తీసుకొచ్చి మీకు రాజుగా కూర్చోబెట్టిన మూర్ఖుడెవరో వాడి సంగతి మొదట
నేను ఈ మాటలు అనేసరికి, ఆ పక్షులకు మరింత కోపం వచ్చింది. అవన్నీ కలిసి నామీదికి యుద్ధానికి వచ్చాయి. నేనూ ఊరుకోలేదు. అవమానించిన వాళ్ళమీద పరాక్రమం చూపించటమే పురుషలక్షణం కాబట్టి నేను వాటినన్నింటినీ ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొన్నాను..
కథ యిక్కడి దాకా రాగానే, హిరణ్యగర్భుడు కథ చెప్తున్న దీర్ఘముఖుడితో యిలా అన్నాడు: 'మదంతో ఒళ్ళు మరిచిపోయి, తామెంతో తమ బలమెంతో తెలుసుకోకుండా, తమకంటే బలవంతులయిన వారితో కయ్యానికి కాలు దువ్వితే, నాశనమయిపోతారు. వెనకటికి ఒక పావురం యిలాగే గురించి, డేగతో పోట్లాడి దెబ్బతిన్న కథ ఒకటి ఉంది. చెప్తాను, విను.
No comments:
Post a Comment