కుక్క-గాడిద రెండవ భాగం

 

             కుక్క-గాడిద - 2



కరటకుడు " రాజు దగ్గర కొలువు చేయాలంటే జాగ్రత్తగా రాజు మనసు తెలుసుకొని ప్రవర్తించాలి.నీ ఇష్టప్రకారం పనిచేయలేవు. జాగ్రత్త!" అని అతణ్ణి హెచ్చరించాడు.
"ఉద్యోగికి దూరభూమీ, విద్వాంసుడికి పరదేశం,మంచిగా మాట్లాడేవారికి శత్రువు ఉండరు. అలాగే బుద్ధిమంతుడుకి అసాధ్యమనేది ఉండదు. మంచి ప్రవర్తనతో ఎప్పుడూ తన సేవ చేసే వాళ్ళను రాజు ఎప్పుడూ ఆదరిస్తాడు.ఆయన కోపంగా ఉన్నడా,శాంతంగా ఉన్నాడా గమనించుకొంటూ నడుచుకుంటే,రాజు అభిమానం తేలిగ్గా పొందవచ్చు"అన్నాడు దమనకుడు.
"ఇంతకు రాజు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడాలి?"
"ఒక్క మటంటూ లేదు. ఆయన మొహం వైపే చూస్తూ,ఆయన నావైపు చూసినప్పుడు ఏదో సమయానికి తగ్గట్టు మాట్లాడేస్తాను. కాస్త ముందు వెనక ఆలోచించుకొని,ఆ కొలువులో ఉన్న మిగిలిన వాళ్లేవరికి కోపాలు రాకుండా,మాట్లాడతాను".
"సరే నీ ఇష్టం. అదుగో రాజు తన ఇంటికి పోతున్నట్టున్నాడు.ఇప్పుడే పట్టుకో పో!"అన్నాడు కరటకుడు.
దమనకుడు పింగళకుడు వైపు పరుగెత్తాడు.అతని దగ్గరకి వెళ్ళి, వినయవిదేయతలు చూపిస్తూ ఒదిగి నిలబడి నమస్కారం చేసాడు. పింగళకుడు అతన్ని కూర్చోబెట్టి 'ఏమయ్యా, బాగున్నావా?" అన్నాడు.
"రాజా, నీ రాజ్యంలో నేనే కాదు, ఇతర జంతువులన్నీ కూడా ఎప్పుడూ సుఖంగా, క్షేమంగానే ఉంటాయి. మీరు పిలవకపోయినా అప్పుడప్పుడూ వచ్చి మీతో మంచి చెడ్డ చెప్పుకొని వెళ్ళటం నా ధర్మం. అలా రాకపోవటం స్వామి ద్రోహం అవుతుంది. మీలాంటి మహానుభావుడి నేను చెప్పగలిగింది ఏమున్నది,కానీ ఒకమట చెప్తాను.మనిషికి బుద్ధి వికసించాలంటే నాలుగు పనులు చేయాలి.ఒకటి బహుడేశటనం,అంటే ఇల్లు విడిచి నాలుగు ఊళ్లు తిరిగి రావడం.రెండు బహూశృతులతో సాంగత్యం,అంటే మంచి పండితులతో స్నేహం.మూడు కావ్యాశాస్త్ర పఠనం,అంటే మంచి పుస్తకాలు, శాస్త్రాలు చదవటం.నాలుగు రాజస్థానంలో బహుకాల సేవ అంటే మీలాంటి పెద్దల దగ్గర పది కాలాలపాటు ఉద్యోగం చేసుకోవటం.ఈ నాలుగు లేకపోతే మనిషికి లోకజ్ఞానం కలగదు.బావిలో కప్ప లాగా పడుంటాడు.తన నెత్తి పైన కనిపిస్తున్న కొంచెమే సర్వస్వమనీ అనుకొంటూ మూర్ఖుడిగా ఉండిపోతాడు. మీలాంటి వాళ్ళని అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటే, నాలాంటి అల్పుడికి కూడా కొంచెం తెలివితేటలు వస్తాయి"అంటూ తియ్యటి కబుర్లు చెప్పాడు.
తర్వాత" రాజా,ఇందాక మీరు యమునానది ఒడ్డుకు వెళ్ళి కొంచెం సేపు అక్కడ నిలబడిపోయి వెనక్కు వచ్చేయటం చూశాను.కారణమేమిటో నాకు తెలియలేదు?" అన్నాడు.
రాజు దమనకుడి పొగడ్తలకు, తీపి మాటలకూ మెత్తబడిపోయి ఉన్నాడు."ఓ అదా? నీలాంటి మంచి మిత్రుడికి చెప్పకూడని రహస్యమేమీ కాదు.అక్కడ ఏదో రంకె వినిపించిందయ్యా.ఆ కేక పెట్టిన జంటువేదో కానీ చాలా బలం గల జంతువు అయి ఉండాలి. లేకపోతే నా రాజ్యంలో నాకు వినపడేలా అంత పెద్ద రంకె వేసేందుకు ధైర్యం ఎవరికి ఉంటుంది?నా అడవిలోనే ఎవరో కొత్త శత్రువు చేరాడన్నమాట.ఎవరన్నది తెలియలేదు.శత్రువుని పట్టి చంపలేకపోతే న రాజ్యంలో నాకేం గౌరవం ఉంటుంది చెప్పు.లోకంలో నలుగురూ నన్ను చూసి నవ్విపోతారు. ఈ శత్రువు ఎవరూ,అతన్ని ఎలా చంపాలీ అన్న ఆలోచనలో పడిపోయానోయ్.ఏం చేస్తే బావుంటుందంటావు?"అని దమనకుడిని సలహా అడగనే అడిగాడు.
దమనకుడు కొంచెం సేపు ఆలోచన నటించాడు."రాజా!నన్నడిగితే, ఊరికే ఒక రంకె విని భయపడటం అనవసరం".




No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...