కుక్క-గాడిద -1
కాశీనగరంలో ధావకమల్లుడు అనే రజకుడు ఉండేవాడు. ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికేసి, అలసిపోయి,ఆ బడలికతో ఆ రాత్రి ఒళ్ళు మరచి నిద్రపోయాడు. ఆనాడు అర్థరాత్రి సమయంలో అతని ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు.
ఇంటి బయట ధావకమల్లుడు తన గాడిదని కట్టేసి ఉంచాడు. దాని పక్కనే ధావకమల్లుడు పెంచుకుంటున్న కుక్క కూడా కూర్చొని ఉంది. దొంగ ఇంట్లోకి చొరపడటం కుక్క,గాడిద రెండూ చూస్తూనే ఉన్నాయి.
గాడిద కుక్కని అడిగింది: " ఇంట్లోకి దొంగ చొరబడితే చూస్తూ ఉరుకున్నవ్, మొరిగి యజమానిని నిద్ర లేపవేమిటి?" అని.
" నేనేం చేయాలో చెప్పేందుకు నువ్వేవరివి?" అంది కుక్క మొండిగా.
"యజమాని ఇల్లు దొంగ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా?"
" అబ్బో! మహా యజమాని! ఇరవై నాలుగు గంటలు ఈ ఇల్లు ఎంత కనిపెట్టుకు ఉన్న, యజమాని మాత్రం మన సంగతి పట్టించుకోడు. సరిగ్గా ఇంత తిండి కూడా పడెయ్యడు. ఇలాంటి యజమానికేమిటి సేవ చేసేది? నేను చెయ్యను" అంది కుక్క.
గాడిదకు కోపం వచ్చింది "యజమానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు,అక్కరకు రాకపోవటం ధర్మం కాదు. అది కృతఘ్నత.మహాపాపం. అయిన నువ్విప్పుడు మొరగనని మొందికేస్తే ఏదో మునిగిపోతుందనుకోకు. నీ పని నేను చేసి యజమానిని నిద్రలేపుతాను చూడు!" అని తనే పెద్దగా ఓండ్ర పెట్టింది.
వచ్చిన దొంగ ఆ శబ్దానికి భయపడి పారిపోయాడు. కానీ మంచి నిద్రలో ఉన్న యజమాని నిద్రలో నుండి లేచి, వేళ కాని వేళలో కూతపెట్టి తన నిద్రచెడగొట్టిన గాడిద మీద పిచ్చికోపం వచ్చి, ఓ దుడ్డుకర్రతో గాడిద తలమీద మోదాడు.తలకి గట్టి దెబ్బ తగిలి, అప్పటికప్పడే గాడిదకు ప్రాణం పోయింది.
అందుచేత,ఎవరి పని వారు చేసుకోవాలి గానీ పరాధికారం నెత్తిన వేసుకోవటానికి ప్రయత్నించగూడదు. సింహాన్ని దాని మానాన వదిలేసి,అడవిలో మనకు పనికొచ్చే ఆహారం ఏదన్నా వేతుకొందం పద"అంటూ కరటకుడు కథ ముగించాడు.
దమనకుడు మాత్రం ఓప్పుకోలేదు. తనకు తోచిన నీతులు తను చెప్పటం మొదలెట్టాడు "తిండి ఎప్పుడూ తినేదే,దానికి తొందర లేదు.తిండి, భయం, నిద్రా అన్ని ప్రాణులకూ ఎప్పుడూ ఉండేవే. ఊరికే తిని ,పడివుండటంలో గొప్పేంముంది? అది అందరూ చేస్తారు.మనం బతుకుతూ,మనతోపాటు నలుగుర్ని బతికించగలిగితేనే జీవితానికి ఒక అర్థం.కుక్క చిన్న ఎముక ముక్క దొరికితేనె సంతోషపడుతుంది.సింహం అయితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి చంపి ఆ మాంసం తింటేనే గానీ తృప్తి చెందలేదు.ఊరకుక్క ఎంత వేలదపడ్డా,ఎవరూ దానికింత తిండి పడెయ్యరు.అదే ఏనుగు గంబీరంగా,హుందాగా తింటుంటే దానికి ప్రేమగా తిండిపెడతారు. సంఘంలో గౌరవం సంపదించుకొలేకపోతే,ఆ బతుకు హీనం. చదువు వల్లో,బలం చేతో, యుక్తి చేతో రాజును మెప్పించి గౌరవం తెచ్చుకొనే జీవితమే జీవితం.
"మన కర్మ బాగుంటే తెలివితేటలు కలుగుతాయి.వాటి వల్ల రాజసన్మానం కలుగుతుంది. దానితో తెలివి మరింత రాణించి, అన్ని వ్యవహరాలూ జరపగల సమర్థత వస్తుంది.
దాంతో రాజస్థానంలో మంచి పదవి దొరుకుతుంది.ఎంత రత్నమైన పెట్టెలో ఉంచేసి దాచేస్తే,దాని కాంతి,విలువ నలుగురికీ తెలిసేదెలా? అందుకే రాజుగారిని ఆశ్రయించి,మన తెలివితేటలు ప్రదర్శించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి"
ఇదంతా విన్న తరువాత కరతకుడు కొంచెం మెత్తబడ్డాడు."రాజుగారి కొలువులో చోటు దొరికితే మంచిదే.కానీ,ఈ మృగరాజు పింగళకుడు మనల్ని ఇంతకు ముందు అవమానించి,గెంటి వేశాడన్న బాధతో అలా అన్నాను. బుద్ధి లేని రాజులని ఆశ్రయించితే కష్టాలు తప్పవు గదా అని నా భయం. ఏదైతేనేం,నువ్వు తెలివైనవాడివి కాబట్టి నువ్వే చెప్పు ఇప్పుడు మనమేం చేయాలో, అలాగే చేద్దాం" అన్నాడు.
"పింగళకుడు భయపడిపోయి ఉన్నాడు. అది నీకెలా తెలిసింది అని అడగకు.ముఖమూ,ఆకారమూ చూసి తెలివైనవాడు ఇతరుల మనస్సులో భావాన్ని పసిగట్టాలి.
అదే గదా పండితుడి లక్షణం?అది లేకపోతే పండితుడికీ,పామరుడికీ, పశువుకీ తేడా లేదు.అదలా ఉంచు. ఇప్పుడు తక్షణ కర్తవ్యమ్ రాజు దగ్గరకు వెళ్ళటం.నేను ఇప్పుడే ఆయన దగ్గరకు పోతున్న నాలుగు మంచి మాటలు చెప్పి ఆయన్ని మంచి చేసుకుంటా ఆయన అభిమానం సంపాదిస్తాను" అన్నాడు దమనకుడు.
No comments:
Post a Comment