నక్క దురాశ



                  నక్క 🦊 దురాశ

                      లఘుపతనకుడు-కాకి
                      చిత్రగ్రీవుడు-పావురాల రాజు
                      హిరణ్యకుడు-ఎలుక
                      మంథరుడు-తాభేలు

వెనకటికి ‘కల్యాణకటకం’ అని ఒక ఊరుండేది. ఆ ఊళ్లో ఓ భోయవాడుండేవాడు. వాడి పేరు భైరవుడు. వాడొకరోజు విల్లూ, బాణాలూ, వలా యివన్నీ తీసుకొని అడవిలోకి వేటకు వెళ్ళాడు. అడవిలో ఓమూల చిన్న గుంట తవ్వి, అందులో నక్కి కూర్చున్నాడు. ఆ వయిపుగా వెళ్ళే జంతువులకు ఎరగా కొలత మారిసాన్ని ఉంచాడు. ఆ మాంసానికి ఆశపడి అటుగా ఒక బలిసిన జింక వచ్చింది. భైరవుడు దాన్ని చంపేసి, మోసుకొంటూ యింటిదారి పట్టాడు. దోవలో పెద్ద అడవిపంది కనిపించింది. ‘ఇవాళ నా అదృష్టమే, అదృష్టం!’ అనుకొంటూ భైరవుడు జింకను కింద ఉంచి, విల్లు పట్టుకొని గురిగా పందిమీదికి బాణం వేశాడు. బాణం పందికి గట్టిగా తగిలింది కానీ పంది వెంటనే చావలేదు. కోపంగా వచ్చి బోయవాడి మీదకు ఉరికి వాణ్ణి చంపేసింది. ఆ తర్వాత, బాణం దెబ్బకి బాగా రక్తం కారిపోయి ఉండటం వల్ల పందికూడా చచ్చిపడిపోయింది. బోయవాడు, పంది పెనుగులాడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మధ్య ఒక పాము నలిగి చనిపోయింది.

ఇదంతా జరిగిన కాసేపటికి ‘దీర్హరావం’ అనే నక్క ఆ వైపు వచ్చింది. ఎదురుగా చచ్చి పడున్న జింక, మనిషి. పంది, పాము వీటన్నిటినీ చూసి దానికి నోరూరిపోయింది. “ఇంక నాకు కొన్ని నెలల పాటు మంచి మాంసానికి కొరత లేదు!” అని ఆనందంతో తబ్బిబ్బయిపోయింది.

“నాకు ఈ మనిషి మాంసం నెలరోజులు సరిపోతుంది. పందీ, జింకల మాంసంతో మరో రెండు నెలలు తేలిగ్గా గడిచిపోతయ్‌. ఈ పాము మాంసం ఒకరోజుకు సరిపోతుంది” అని లెక్కలు వేసుకొంది.

“ఇదంతా నిదానంగా హాయిగా తింటాను. ఈ విల్లుకున్న తాడు కూడా జంతుపుల నరంతో చేసిందే. ప్రస్తుతానికి యిది కొరికి చూస్తాను” అనుకొంటూ విల్లు తాడు కొరికింది. తాడు తెగి, నక్కకు ఠక్కున విల్లు తగిలేసరికి ఆ దెబ్బకు నక్క అక్కడికక్కడే చచ్చిపడిపోయింది.

“విన్నారా కథ? దురాశవల్లే నక్క చావును కొని తెచ్చుకొంది” అన్నాడు మంథరుడు. “అందుకే చెప్పాను, తను తినక, యితరులకివ్వక కూడబెట్టే డబ్బు వల్ల ఏం ప్రయోజనిం. చచ్చిన తరువాత, వెంట వచ్చేదేమీ కాదు గదా!”

“అయినా, అయిపోయిన కథ యిప్పుడెందుకు తవ్వుకోవటం? తెలివయినవాళ్ళు రాని దానికోసం చూస్తూ కూర్చోరు, పోయిన దానికోసం ఏడవనూ ఏడవరు. కష్టం వస్తే దిగాలు పడనూ పడరు. కాబట్టి , హిరణ్యకా, ఎప్పుడు ఉత్సాహంగా ఉండు. హుషారుగా ఉండేవాడే నిజంగా పండితుడు. ఎప్పుడూ దిగులువడే విద్వాంసుడు ఎన్ని విషయాలు తెలిసినా మూర్ఖుడు.


మందుల పేర్లన్నీ తెలిసి, విన్న మాత్రాన రోగంపోదు, మందు తీసుకొంటేనే దానివల్ల ఉపయోగం. గుడ్దివాడికి వాడి చేతిలో ఎంత మంచిదీపం ఉండీ లాభం ఎలా ఉండదో, అలాగే వివేకం లేనివాడికి ఎన్ని శాస్త్రాలు తెలిసీ ఉపయోగం ఉండదు.

“నన్ను చూడు. ఆపదలు వస్తే నేను దుఃఖించను. సంపద వస్తే తబ్బిబ్బయిపోను. అప్పుడప్పుడు కష్టాలొస్తయ్. అప్పుడప్పుడూ సుఖాలొస్తయ్. ఇది సహజం. డబ్బు రావటం, పోవటం , ఎందుకంటే అది ఎలాగూ కలకాలం ఉండేది కాదు. డల్చులేనంత మాత్రాన, నిలకడగల మనిషికి గౌరవానికేమీ భంగం ఉండదు. డబ్బు ఉన్నంత మాత్రాన ఓ క్షుద్రుడికి చాలా గౌరవం లభిస్తుందనటం కూడా సరికాదు. వంద బంగారు గొలుసులు వేస్తే మాత్రం కుక్క సింహంతో సమానమవుతుందా? నువ్వు బుద్దిమంతుడివి. ఇప్పుడు నీ గౌరవానికొచ్చిన లోపమేమీ లేదు. నువ్వే అన్నట్టు, పరమ దయామయుడయిన దేవుడు మనకింత ఆహారం చూపించకుండా ఉండడు. ఎలా బతుకుతానో అని ఎక్కువ దిగులుపడవలసిన పనిలేదు.

“'పైగా నువ్వేమో ధర్మాలన్ని తెలిసినవాడివి. నీకు నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. నాకు ఈ లఘుపతనకుడెంతో నువ్వు అంతే. ఆ దేవుడే మన ముగ్గురినీ కలిపాడు. ఏదో దొరికింది యింత తిని హాయిగా కాలం గడుపుదాం. దిగులుపడకు” అన్నాడు మంథరుడు.

ఈ మాటలు హిరణ్యకుడికి నచ్చాయి. అతని దిగులు వదిలిపోయి ఉల్లాసం కలిగింది.

“మంచిమిత్రుడు చెప్పాల్సిన మాటలు చెప్పావోయ్‌ మంథరా! నువ్వు చెప్పింది నిజం. దేవుడుండనే ఉన్నాడు మనకెందుకు చింత? ఈ సృష్టి నిండా ఎన్నో రకాల పశువులనీ ,పిట్టలనీ యితర జంతువుల్నీ పుట్టించేప్పుడే దేవుడు వాటికి తగ్గ ఆహార, విహారాల్నీ సృష్టించే ఉంచాడు. ఇది మర్చిపో ఊరికే అవసరానికి మించిన డబ్బు, దస్కం సంపాదించటానికి నానా పాట్లూ పడటం, అది కాపాడుకోవటానికి మరిన్ని అగచాట్లు పడటం యిదంతా ఎందుకు? ఈ మితిమీరిన డబ్బు ఆశ వల్ల దుఃఖమే గానీ, సుఖం లేదు. ఆశ ఒక్కటి తగ్గించుకొంటే, ఇక
 ధనికుడూ లేడూ, దరిద్రుడు లేడు. ధనధాన్యాల సరిపడ కంటే నీలాంటి మిత్రులు లభించటమే, ఈ మిత్రలాభమే గొప్పసంపద” అన్నాడు.

కాలం గడుస్తూ ఉంది.

మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...
                  ధన్యవాదలు...

                        ఇంకా ఉంది...

    తరువాత కథ: చిత్రాంగుడు

Please visit the blog.share and comment the story...enjoy by reading the story

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...