తపతి పరిణయం

            తపతి పరిణయం 


చంద్రవంశానికి చెందిన ఋక్లుడి కొడుకు సంవరణుడు తండ్రి తదనంతరం ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించసాగాడు. మహారాజులు అందరిలాగానే సంవరణుడికి కూడా వేట అంటే ఇష్టం. ఇష్టం చేత తరచుగా అరణ్యాలకు వెళ్లేవాడు.

అలవాటు కొద్ది సంవరణుడు ఒకసారి దట్టమైన కీకారణ్యంలోకి వెళ్లాడు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, క్రూరమృగాలను వేటాడుతూ అడవిలో సంచరించసాగాడు. అలా అడవిలో తిరుగుతున్న సమయంలో ఉన్నట్లుండి అతడి కళ్ల ముందు మెరుపు మెరిసినట్లయింది. అడవి అడవంతా పరిమళభరితమై తోచింది. సంవరణుడు తల పైకెత్తి ఎదురుగా దృష్టి సాదించాడు. కళ్ల ముందు అద్భుత సౌందర్యరాశి నిలిచి ఉంది.

రెప్ప వాల్చకుండా ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఎటువైపుగా వెళితే అటువైపు వెళుతూ ఆమెనే అనుసరిస్తూ అడవిలో తిరుగాడాడు. జరుగుతున్నది కలో నిజమో అర్ధం కాలేదతనికి, ముగ్ధ మోహనమైన ఆమె రూపలావణ్యాలు మానవకాంతలకు అసాధ్యమనుకున్నాడు. వనదేవతే ఇలా వచ్చిందేమో, తన పుణ్యఫలం వల్లనే ఆమె తనకు కనిపించిందేమో అనుకున్నాడు. ఇలా పరిపరి విధాలుగా తలపోస్తూ ఆమెను అనుసరిస్తూనే, నెమ్మదిగా మాటలు కూడదీసుకుని ఆమెను పలకరించాడు.

'ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ కీకారణ్యంలో ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నావు ?..."

సంవరణుడి గొంతు వినబడటంతో ఆమె వెనుదిరిగి చూసింది.

ఆయుధాలు ధరించిన ఆజానుబాహుడిని తేరిపార చూసింది. వీరుడిలాగే ఉన్నాడు. అనుకుంది.

భూలోక విహారానికి వచ్చిన తనను ఇంతగా ఆకర్షిస్తున్నాడేమిటా అని విస్తుపోయింది. సంవరణుడు ఆమె నుంచి చూపు మరల్చుకోలేక అలా చూస్తూనే ఉండిపోయాడు. ఆమె చిరునవ్వు సవ్వింది. బదులుగా ఒక్క మాటైనా పలకలేదు. తృటిలో మాయమై పోయింది.

అనూహ్య పరిణామానికి సంవరణుడు దిగ్భ్రాంతుడయ్యాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయేసరికి దుఃఖంలో మునిగిపోయాడు. బిగ్గరగా రోదిస్తూ, మూర్ఛిల్లాడు.

తన కోసం విలపిస్తున్న సంవరణుడిని గగనతలం నుంచి తిలకించిందామె. దర్శనమాత్రం చేతనే తన కోసం విలపిస్తున్న అతడిపై ఆమెకు గాలి ప్రేమ ఒక్కసారిగా కలిగాయి.

మళ్లీ నేలకు దిగి, సంవరణుడి ఎదుట. నిలిచింది. మూర్ఛ నుంచి తేరుకున్న సంవరణుడికి కళ్లెదుట చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.

ఎందుకు ఆవేదన చెందుతున్నావు?' అడిగిందామె. 'నేను సంవరణుడిని, మహారాజును, ఎందరో స్త్రీలను చూసినా, ఎన్నడూ నా మనసు చలించలేదు. నిన్ను చూడగానే నా మనసు నా అధీనం తప్పింది. పూర్తిగా నీకే వశమైపోయింది.

నువ్వు అదృశ్యం కాగానే అంతా శూన్యమైపోయినట్లనిపించింది. నువ్వు లేకుండా జీవించలేను. ప్రకృతి సాక్షిగా మనం గాంధర్వ వివాహం చేసుకుందాం' అన్నాడు.

'నేను సూర్యభగవానుడి పుత్రికను. తపతిని. నేను స్వతంత్రను కాను. నా తండ్రి అనుమతి కావాలి. తపస్సుతో నా తండ్రిని ప్రసన్నుణ్ణి చేసుకో అని చెప్పి, సౌరమండలానికి ఎగసి పోయింది.

తపతీ వియోగాన్ని తట్టుకోలేక సంవరుణుడు అక్కడికక్కడే తపస్సు ప్రారంభించాడు. కాలం గడిచే కొద్ది ఉపవాస దీక్షతో కృశించిపోసాగాడు. అయినా చలించకుండా తపస్సు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా, ఒకనాడు వశిష్టుడు తన శిష్యుడైన సంవరణుడిని చూడాలనుకున్నాడు. రాజ్యాన్ని విడిచి, అడవిలో తపోనిష్టతో కృశించిపోయిన శిష్యుడిని చూసి సహించలేకపోయాడు. శిష్యుడి బాధకు కారణం తెలుసుకుని, తపోబలంతో నేరుగా సౌరమండలానికి వెళ్లారు.

సూర్యుడు ఎదురేగి వశిష్ఠుడిని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యపాద్యాదులతో అతిథి మర్యాదలు చేశాడు.

'మహర్షీ! మీ రాకకు కారణం' వినయంగా అడిగాడు సూర్యుడు.

"సంవరణుడు నా శిష్యుడు. సకల సద్గుణ సంపన్నుడు. నీ కూతురు తపతిపై మరులుగొన్నాడు. ఆమెకు అతడు అన్నివిధాలా తగినవాడు తపతీ సంవరణుల వివాహం జరిపించు. నీకు కన్యాదాన ఫలం దక్కుతుంది' అని చెప్పాడు.

వశిష్టుడంతటి వాడు స్వయంగా అడగడంతో సూర్యుడు కాదనలేకపోయాడు. అతడి మాటనే ఆజ్ఞలా తలదాల్సి తపతీ సంవరణుల పరిణయాన్ని అంగరంగ వైభవంగా జరిపించాడు. సంవరణుడి ప్రేమగాథ అలా సుఖాంతమైంది.

వ్యాసుని జన్మ

              వ్యాసుని జన్మ


పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి "నీ వర్ణాశ్రమధర్మ పరిపాలనకు, తపస్సుకు మెచ్చుకొంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలనం చేస్తూ ఉండు" అని పలికి అతనికి దివ్యత్వాన్నీ, మణి సువర్ణమయమైన దివ్యవిమానాన్నీ, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు సమర్ధమైన వేణుయష్టినీ ఇచ్చాడు. ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది.


వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా "శుక్తిమతి" అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న "కోలహలుడు" అనే పర్వతము "శుక్తిమతి" మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా, ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. శుక్తిమతికి, కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె "వసుపదుడు" అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు.


ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి, ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది.


పూర్వం బ్రహ్మ శాపం వలన "అద్రిక" అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. పదినెలల తరువాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజు నకు ఇస్తారు. అద్రిక అనే పేరుకల ఆ చేపరూపంలో ఉన్న అప్సర; మనుష్యులను కంటే తనకు శాపవిమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వీడి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది.


ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది.


ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు.


అక్కడ కనిపించిన మత్స్యగంధిని (ఆమెనే సత్యవతి కూడా అంటారు) చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినదని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే, అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు అతడే వ్యాసుడు.వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. తల్లి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు వ్యాసుడు.

నరసింహ అవతారం

         నరసింహ అవతారం       

ఒకప్పుడు రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం , భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే వరం తనకు ఉంది కనుక ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక దహనం అవుతుంది ప్రహ్లాదుడికి చిన్న గాయం కూడా కాదు అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో (సగం మనిషి , సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) , తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా).

అమ్మ కోసం

                  అమ్మ కోసం


ఒకప్పుడు, వినయ్ అనే అబ్బాయి తన తల్లితో కలిసి ఊరి చివర ఒక చిన్న కుటీరంలో ఉండేవాడు. వినయ్ తల్లి ఎంతో దయతో,ప్రేమతో ఉండేవారు.ఆమె భర్త మరణించిన తరువాత తన కొడుకును పోషించడానికి చాలా కష్టపడింది.

వారి నిరాడంబరమైన జీవనం సాగిస్తూ,వినయ్ మరియు అతని తల్లి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు.వారు ఉన్న దానితో సంతృప్తి చెందేవారు. వారు తమ చిన్న తోటను చూసుకుంటూ, కలిసి భోజనం చేస్తూ, రాత్రి పొయ్యి దగ్గర కథలు పంచుకుంటూ తమ రోజులు గడిపారు.

ఒకరోజు వినయ్ తల్లి అనారోగ్యంతో పని చేయలేక పోయింది. వినయ్ తన తల్లి గురించి ఆందోళన చెందాడు మరియు ఆమె సంరక్షణ కోసం తాను చేయగలిగినదంతా చేశాడు. అతను భోజనం వండాడు, ఇల్లు శుభ్రం చేశాడు మరియు తన తల్లికి కావలసినవన్నీ ఉండేలా చూసుకున్నాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ వినయ్ తల్లి మరింత బలహీనపడింది. ఆమె బాగుపడాలంటే ఏదో ఒకటి చేయాలని వినయ్‌కి తెలుసు. ఎలాంటి జబ్బునైనా నయం చేసే అద్భుత మూలిక గురించి తన తల్లి చెప్పిన కథ అతనికి గుర్తుకు వచ్చింది.

వనమూలికను కనుగొనాలని నిశ్చయించుకున్న వినయ్, దారిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అడవిలో ప్రయాణానికి బయలుదేరాడు. రోజుల తరబడి వెతికిన తర్వాత, అతను చివరకు మాయా మూలికను కనుగొని తన తల్లికి తిరిగి తీసుకువచ్చాడు.

మూలికల సహాయంతో, వినయ్ తల్లి త్వరగా కోలుకుంది మరియు తన పాత స్థితికి తిరిగి వచ్చింది. తన కుమారుడి ధైర్యం మరియు సంకల్పం చూసి ఆమె చాలా గర్వపడింది. ఆ రోజు నుండి, వినయ్ మరియు అతని తల్లి ఎప్పటికీ సంతోషంగా జీవించారు.వారు పంచుకున్న ప్రేమ మరియు బంధానికి ఎంతో విలువ ఇచ్చేవారు.

వారి కథ గ్రామంలో ఒక పురాణ కథగా మారింది, ప్రతి ఒక్కరికి ప్రేమ యొక్క శక్తిని మరియు తల్లీ కొడుకుల బంధం యొక్క బలాన్ని గుర్తు చేస్తుంది. వినయ్ మరియు అతని తల్లి ఒకరినొకరు ప్రేమిస్తూనే ఉంటారు. వారు కలిసి తమ దారికి వచ్చిన ఏదైనా అడ్డంకిని అధిగమించగలరని తెలుసు.

కుబేరుడు

                కుబేరుడు 


కుబేరుడు బ్రహ్మ కుమారుడైన పులస్త్యుని మనుమడు. విశ్రవసు ఇలిబిలకు జన్మించాడు. రావణ, కుంభకర్ణ, విభీషణులు విశ్రవసుడికి మరో భార్యవల్ల జన్మించారు. 


కుబేరుని ప్రాముఖ్యత : ఒకసారి దేవతలు కుబేరుడి తరఫున వరుణుడు యాగంచేసి సముద్రుడికి నదులకు అధిపతిని చేయగా అవి ఇతనికి ఎంతో సంపదని చ్చాయి. శివుడు కూడా కుబేరుడికి స్నేహితుడయ్యాడు.


లంకానగర రాజు : కుబేరుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరు కొమని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు దిక్పాలకుడ్ని(అన్ని దిక్కులను పాలించేవాడిని) కావాలని, సంపదకు అధిపతిని కావాలని కోరుకుంటాడు. అపుడు బ్రహ్మ కుబేరుడికి ఆ వరాలను ప్రసాదిస్తాడు. కుబేరుడు తన తండ్రికి తానుపొందిన వరాలను గూర్చి చెప్పి తనకో నగరం నిర్మించమని అడుగుతాడు. అప్పుడు విశ్రవసుడు దక్షిణ సముద్రంలో లంకానగరాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుండి కుబేరుడు లంకా నగరంలో నివసించాడు. బ్రహ్మ నుండి సంపదతో పాటు పుష్పక విమానం కూడా పొందుతాడు.


రావణుని లంక : విశ్రవసువుకు మరో భార్య వల్ల జన్మించిన రావణుడు. బ్రహ్మనుండి ఎన్నో వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతాడు. అప్పుడు కుబేరుడు గంధమాదనం పైకి వెళ్లి అలకాపురిని నిర్మించుకుని అక్కడే నివసిస్తూ ఉంటాడు.  


రావణ కుబేరుల యుద్ధం : రావణుడు దేవతల్ని బ్రహ్మణుల్ని హింసిస్తుండగా వారు మహావిష్ణువును ఆశ్రయిస్తారు. ఇది తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుడిని నీతిగా జీవించమని తన మనిషితో కబురు పంపుతాడు. అయితే కుబేరుడు పంపిన మనిషి చెప్పిన మాటలకు కోపం చేసుకున్న రావణుడు అతడిని నరికివేయడమేకాక ముందుగా కుబేరునిపై దండెత్తి కుబేరుడిని ఓడిస్తారు. అయితే రావణుడి చేతికి కుబేరుడు దొరకకుండా యక్షులు ఓ విమానంలో కుబేరుడ్ని తీసుకెళ్లిపోయి కాపాడుతారు. 


కుబేరుడు ఊసరవెల్లిగా మారిన సంఘటన పురాణాల్లో ఉంది. మరుత్త మహారాజు మహేశ్వర యజ్ఞం చేస్తూ ఇంద్ర, కుబేర, వరుణ, యముల్ని ఆహ్వానిస్తాడు. అదే సమయంలో రావణుడు తన జైత్రయాత్ర ముగించుకొని ఈ యాగానికి వస్తాడు. అప్పుడు అక్కడున్న ఇంద్ర, కుబేర, వరుణ, యములు కొన్ని జంతువుల రూపాల్లోకి మరిపోతారు. కుబేరుడు ఊసరవెల్లిగా మారతాడు. 


 కుబేరుని శాపాలు :


ఒకసారి పార్వతి శివుని తొడపై కూర్చొని వుండగా కుబేరుడు ఈర్ష్యతో చూస్తాడు. అప్పుడు అది గమనించిన పార్వతి ఇతడి కన్నుపోయేటట్లు శపించింది. కుబేరుడు శాపవిమోచన కోరగా ఆ కన్ను గవ్వకన్నుగా మారుతుందని శాపవి మోచన కల్గిస్తుంది.


అలాగే ఇంకొకసారి కుబేరుని అనుచరుడైన మణిమానుడు అగస్త్యుని తలపై ఉమ్మివేయగా ఇతడు ఇతడి సైన్యము ఓ మానవునిచే చంపబడతారని అందుకు నీవు దుఃఖిస్తావని శపిస్తాడు. భీమసేనుడు సౌగంధిక పుష్పాలకొరకు గంధమాదనం వెళ్లినపుడు మణిమానుడిని అతడి సైన్యాన్ని సంహరిస్తాడు. భీముడు కుబేరుడిని చూసినపుడు ఆ పాప పరిహారం జరుగుతుంది.


కుబేరుడి భార్య పేరు భద్ర. ఇతడు నరవాహనుడు. ఇతడి వాహనాన్ని నరులు మోస్తారు.

వజ్రాయుధం

               వజ్రాయుధం 

      
పూర్వం విశ్వరూపుడనే మహర్షి ఉండేవాడు. ఆ విశ్వరూపుడు తపోయజ్ఞాలతో నానాటికీ బలపడసాగాడు. ఆయనలో రాక్షసుల అంశ ఉండటంతో... ఏనాటికైనా తనను జయిస్తాడేమో అన్న అనుమానం ఇంద్రునిలో మొదలైంది. దాంతో విశ్వరూపుని హతమార్చి పారేశాడు. విశ్వరూపుని మరణవార్త అతని తండ్రి త్వష్ట ప్రజాపతికి చేరింది. తన కుమారుడి మరణవార్తతో త్వష్ట ప్రజాపతి రగిలిపోయాడు. అందుకు కారణమైన ఇంద్రుని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు.

ఇంద్రుని హతమార్చేందుకు త్వష్ట ప్రజాపతి ఓ గొప్ప హోమాన్ని చేయసాగాడు. ఆ అగ్నిగుండంలోంచి వృత్రాసురుడనే రాక్షసుడు వెలువడ్డాడు. అసలే అమిత బలవంతుడు. ఆపై ఓ చిత్రమైన వరం కూడా వృత్రాసురునికి ఉండేది. పగలు కానీ రాత్రి కానీ, లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ, ఇప్పటివరకూ ఉన్న ఆయుధాలతో కానీ, తడి వస్తువుతో కానీ పొడి వస్తువుతో కానీ... తనకు మరణం సంభవించకూడదన్నదే ఆయనకి ఉన్న వరం.

కష్టసాధ్యమైన వరాన్ని పొందిన వృత్రాసురునికి ఇక అంతులేకుండా పోయింది. ముల్లోకాల మీదా దాడి చేసి ప్రజలందరినీ పీడించసాగాడు. వృత్రాసురుని జయించే ఉపాయం తోచక దేవతలంతా, విష్ణువు చెంతకి చేరారు. వృత్రాసురుని సంహరించేందుకు ఓ సరికొత్త ఆయుధం కావాలి. అది చెక్కతోనూ, లోహంతోనూ, రాతితోనూ చేయబడి ఉండకూడదు. కాబట్టి దధీచి అనే రుషి వెన్నెముకతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ విష్ణుమూర్తి వారికి సూచించాడు.

దేవతల కోరికను విన్న దధీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పించాడు. అలా ఆయన వెన్నెముకతో రూపొందించినదే ‘వజ్రాయుధం’. ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్రాసురుని వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురుచూడసాగాడు. ఒకసారి వృత్రాసురుడు సముద్రతీరాన ఇంద్రుని కంటపడ్డాడు. అది పగలూ, రాత్రీ కాని సూర్యాస్తమ సమయం. తన చేతిలో వజ్రాయుధం ఉంది. దానికి సమద్రపు అలల మీద ఉన్న నురగను తాటించాడు ఇంద్రడు. దాంతో అది అటు తడీపొడీ కానీ ఆయుధంగా మారింది. ఆ వజ్రాయుధంతో వృత్రాసురుని వధించాడు ఇంద్రడు.

జాలకన్య

 ఒకరోజు మత్స్యకారుడికి సముద్రంలో ఒక జలకన్య దొరికింది.ఆ జాలకన్య మనిషిగా కూడా మరగలదు. 

ఆ మత్స్యకారుడు,అతని భార్య మరియు కొడుకు ఒక అందమైన యువతిగా మారిన జలకన్యను చూసి ఎంతో సంతోషించారు. వారు ఆమెకు రమాణి అని పేరు పెట్టి, వారి ఇంట్లోకి ఆహ్వానించారు.


రమాణి దయగల మంచి జలకన్య. ఆమె త్వరగానే ఆ కుటుంబంలో ముఖ్యమైన సభ్యురాలిగా మారింది. ఇంటి పనుల్లో సహాయం చేసి, ఆ కొడుకును తన కొడుకులా చూసుకుంది.


అయితే,  మత్స్యకారుడు  తన ఇంట్లో మాయా జీవి ఉండటం పట్ల ఇబ్బందిగా భావించాడు. అలాంటి జీవిని మిగతా లోకం నుండి దాచి ఉంచడం వల్ల వచ్చే పరిణామాల గురించి అతను ఆందోళన చెందాడు.


ఒక రోజు, ఎక్కడి నుంచో వచ్చిన అద్భుతమైన స్త్రీని చూసేందుకు కొందరు గ్రామస్థులు   మత్స్యకారుడు  ఇంటికి వచ్చారు. రమాణిని దాచేందుకు మత్స్యకారుడు ప్రయత్నించాడు, కానీ ఆమె సూర్యకాంతిని తట్టుకోలేకపోయి, అందరి ముందుకు జలకన్యగా మారిపోయింది.


గ్రామస్థులు ఆశ్చర్యపడి భయపడ్డారు.    మత్స్యకారుడు      తన ఇంట్లో జలకన్యను దాచి ఉంచడం వల్ల అతన్ని మంత్రగాడు అని నిందించారు. రమాణిని వెంటనే ఊరి నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.


అపరాధభావంతో, సిగ్గుతో, మత్స్యకారుడు           రమాణిని తిరిగి సముద్రంలోకి వదిలేయడం తప్ప మరే విధానం లేకుండా పోయింది. ఆమె ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా, ఆమెను దాచేందుకు ప్రయత్నించడంలో తాను చేసిన తప్పును అతను గ్రహించాడు. సముద్రపు మాయాజాలంలో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదని అతను మనసులో నిర్ణయించుకున్నాడు.


అప్పటి నుండి,    మత్స్యకారుడు      మరియు అతని కుటుంబం నిశ్శబ్ద జీవితాన్ని గడిపారు. వారి ఇంటిని కొద్దికాలం అలంకరించిన అందమైన జలకన్య జ్ఞాపకాలు వారిని వెంటాడాయి. మరియు రమాణి, జలకన్య-మనిషిగా మారిన ఆమె, సముద్రంలో ఈదుతూనే ఉంది,  ఆమెను ఒకప్పుడు తెలుసుకున్న వారికి ఎప్పటికీ ఓ రహస్యంగానే ఉండిపోయింది.

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...