కాకి - హంస
ఉజ్జయిని నగరం పొలిమేరల్లో ఒక రావిచెట్టు ఉండేది. చెట్టు మీద ఒక కానీ, ఒక హంసా గూళ్ళు కట్టుకొని నివసించేవి.
ఒకరోజు మండుటెండలో ఒక బాటసారి నడుచు కొంటూ వచ్చి, అలసిపోయి ఆ చెట్టు కింద పడుకొన్నాడు. కాస్సేపటి తర్వాత నీడ కొంచెం తొలిగి, అతని కళ్ళ మీద ఎండ పడుతుండగా హంస చూచింది.
పాపం మంచినిద్రలో ఉన్నవాడికి నిద్రాభంగంమవు తుందని, దయ తలచి, ఎండ అతని మీద పడకుండా తన రెక్కలు అడ్డుగా పెట్టి కూర్చొంది.
దానిపై కొమ్మమీద కూచొన్న కాకికి, ఆ బాటసారి అలా సుఖంగా నిద్రపోతుంటే, కన్ను కుట్టింది. ఈర్ష్య పట్టలేక, ఆ కుళ్ళుమోతు కాకి, ఆ బాటసారి మొహాన పడేలా రెట్ట వేసింది. వేసి యింక అక్కడ నిలవకుండా ఎగిరిపోయింది. అలా చేయటం వల్ల దానికి ఒరిగిందేమీ లేదు. దుర్మార్గుల స్వభావం అంతే మరి.
కాస్సేపటికి బాటసారి నిద్రలేచాడు. మొహాన రెట్ట తుడుచుకొంటూ పైకి చూశాడు. హంస కనిపించింది. తన ముఖం మీద హుసే రెట్ట వేసిందని అపోహపడి, తన విల్లంబులు అందుకొని ఒక్క బాణంతో హంసని కూలగొట్టాడు. ఏ పాపం ఎరగని హంస చచ్చిపోయింది. "పాపీ చిరాయువు" అన్నట్లు, పాపిష్ఠి కాకి మాత్రం బతికిపోయింది.
అందుకే దుర్మార్గుడయిన ఈ కొంగ వంటి వాళ్ళతో కలవటం ప్రమాదమని నా అరుణముఖుడు. అభిప్రాయం' అన్నాడు.
అదంతా విని, నేను అరుణముఖుడితో యిలా అన్నాను : "స్నేహితుడా, నాకు మా రాజెంతో నువ్వూ అంతే. ఆమాటకొస్తే, మంచివాళ్లు లోకంలో అందరూ తమలాంటి వాళ్ళే అని భావిస్తారు. నేను ఒకటి, మరొకడు ఒకటి అనుకోవటం "ఆత్మవత్సర్వ భూతాని" (అన్ని ప్రాణులూ మనలాంటివే) అన్న సూక్తి తెలుసు గదా! క్షణభంగురమయిన శరీరం కోసం, నిన్ను చంపి ఆ పాపాన నరకానికి వెళతానా? నీకు రాగల ప్రమాదం ఏమీ లేదు. నాతో వచ్చెయ్" అంటే, ఆ అరుణముఖుడు పకపక నవ్వాడు. "నీ మాయ మాటలు నేను నమ్ముతాననుకోబోకు. నువ్వు యిప్పటి పగ మనసులో పెట్టుకొని, నాతో వచ్చి, మధ్య దారిలో నన్ను చంపేస్తావు. అందుకే యిన్ని తియ్యటి మాటలు చెప్తున్నావు. 'అతి వినయం ధూర్త లక్షణం' అన్నారు. నీ మెత్తటి మాటలు చూస్తేనే నువ్వు| ధూర్తుడివీ, దుర్మార్గుడివీ అని తెలిసిపోతున్నది. ఇప్పటిదాకా మమ్మల్నీ, మా దేశాన్నీ, రాజునీ అంతలా తిట్టేసి, యిప్పుడు మాట మారుస్తున్నావు. అసలు మా రాజుకూ, మీ రాజుకూ యుద్ధం రావటానికి నీ మాటలే గదా కారణం? మునుపు ఇలాగే, ఓ పెద్దపులి కొంగను చంపిన కథ ఉన్నది, విను" అంటూ పులీ, కొంగా కథ చెప్పాడు.
No comments:
Post a Comment