సీతాదేవి అనుమతి

                               సీతాదేవి అనుమతి 

రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ్మ అంటూ విసిగిస్తున్నాడు. నాయనమ్మ  సరే అంది కానీ ఇది కథ కాదు కల.చింటూ కలా అన్నాడు.నాయనమ్మ మరి మొదలు పెడదామా అంటూ కథలోకి 


             

"రామాయణంలో రావణుడు సీతాదేవిని తీసుకెళ్ళేటపుడు ఆమె తన నగలు అన్ని ఒక మూటలో పెట్టి విసిరింది.ఆ మూట హనుమకు దొరికింది కానీ అందులో నుండి ఒక ఉంగరం నీళ్లలో పడింది.ఆ ఉంగరాన్ని చేప ఆహారం అనుకోని తినేసింది.చాలా రోజులు గడిచాయి.ఒక రోజు జాలరి చేపలు పట్టడానికి వచ్చి ఆ చేపని పట్టుకుని వెళ్ళాడు.ఇంటికి వెళ్లి కోసి చూస్తే అందులో ఉంగరం ఉంది.ఆ ఉంగరం తను భార్యకి ఇచ్చి పెట్టుకోమన్నాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే తన దరిద్రం అంత పోయి పెద్ద ధనవంతుడు అయిపోయాడు. ఈ విషయం ఆ ఉంగరం తన చేతికి ఉన్నందుకే అని గ్రహించిన భార్య భర్తతో ఇది మాములు ఉంగరం కాదని ఏదో మహిమ గలది అని చెప్పింది.ఆ రోజు నుండి ఆ ఉంగరం చేతికి పెట్టుకోవడం మానేసి పూజించడం మొదలు పెట్టారు. అలా కొన్ని ఏళ్ళు గడిచాయి సీతారాములు వాళ్ళ వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకి వచ్చి రాజ్యపాలన చేస్తున్నారు.మళ్ళీ ఇంతలో సీతాదేవి గర్భవతి అవ్వడం అన్ని చక చక జరిగిపోయాయి.ఇటు వైపు జాలరి తన వృతి మానకుండా రోజు చేపల వేటకు వెళ్తూ ఉన్నాడు.కొద్ది రోజుల్లోనే పెద్ద విషాదం అలుముకుంది.సీతాదేవిని రజకుడు ఏదో అనడం రాముడి చెవిన పడటం మళ్ళీ సీతదేవీ అడవికి వెళ్ళటం జరిగిపోయాయి.ఇటు జాలరి తన ఇంటినీ శుభ్రం చేద్దామని అన్ని వస్తువులు బయటకు తీసుకుని వెళ్ళి ఆక్కడ ఉంచి మిగతా వస్తువులు తీసుకొని వస్తున్నప్పుడు గమనించక ఆ ఉంగరాన్ని కూడా బయట పెట్టాడు. అప్పుడు ఒక పక్షి మిలా మిలా మెరుస్తూ ఉన్న ఆ ఉంగరాన్ని ఆహారం అనుకోని తీసుకొని వెళ్ళింది.అటు రాముడు ఆశ్వమేధా యాగం జరిపించాలని అనుకున్నాడు.రాజ్య ప్రజలు వారికి తోచిన బంగారం తీసుకుని వెళ్ళి రామునికి సమర్పించడం జరిగే సమయంలో ఒక ఇంట్లోని ముసలావిడ బాధతో తన దగ్గర రామునికి ఇవ్వడానికి ఏమి లేదని విచారిస్తోంది.తన మనవరాలు నీళ్ళకోసం వెళ్ళి కుండ నెత్తిన పెట్టుకోని వస్తూ ఉంది.ఉంగరం నోటితో కరచుకొని ఆ పక్షి కూడా ఆటు వైపే వెళ్ళింది.ఇంతలో నోటిలోని ఉంగరం కాస్త జారి ఆ కుండలో పడింది. ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ మనవరాలు నీళ్లలో ఏదో మెరుస్తూ ఉంది అని అవ్వకు చూడమని చెప్పింది.ఆ ఉంగరాన్ని చూసిన అవ్వకి నోట్లోంచి మాట రాక మూగబోయింది.తరువాత ఆ అవ్వ ఇది రాముని యాగంలోకి ఇవ్వడానికి ఆ పరమేశుడు నాకు ఇచ్చాడు అన్నది.వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకుని రాముని దగ్గరకు వెళ్ళి ఇచ్చింది.ఆ ఉంగరాన్ని చూసి రాముడు ఇది నీకు ఎక్కడిది అని అడిగాడు.నాకు మా నీళ్ళ కుండలో దొరికింది అని అవ్వ చెప్పింది.రాముడు అప్పుడు ఆ ఉంగరాన్ని చూస్తూ ఈ యాగానికి సీతను లేకుండా చేస్తున్న అన్న బాధ ఇప్పుడు లేదు ఎందుకంటే సీతే తన ఉంగరం అనుమతిగా పంపించింది. ఈ ఉంగరం మన సీతాదేవిదే అని కౌసల్య మాతతో అన్నాడు."

ఆ కథ వింటున్న చింటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు....

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...